'దళపతి67'లో ఆ స్టార్ హీరో.. రోలెక్స్ రోల్ అదిరిపోనుందట!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయన తమిళ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకుని కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు.

 Star Hero For Thalapathy67, Thalapathy67, Thalapathy Vijay, Kamal Haasan, Lokesh-TeluguStop.com

ఇక విజయ్ సినిమాలు డబ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అయ్యేవి.దీంతో ఈయనకు ఇక్కడ కూడా కొద్దిగా మార్కెట్ అయితే ఉంది.

మంచి పండుగ సీజన్స్ లో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం అయితే ఉంది.

ఇక తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వారసుడు సినిమా ఈ విషయాన్నీ నిరూపించింది.

తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టింది.మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించగా.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి విజయ్ స్టామినా ఏంటో నిరూపించింది.

Telugu Kamal Haasan, Kollywood, Thalapathy-Movie

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ నెక్స్ట్ సినిమా కూడా వెంటనే లైన్లో పెట్టాడు.మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో దళపతి 67 సినిమా తెరకెక్కుతుంది.ఇటీవలే లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ సినిమా రిలీజ్ అయ్యింది.ఇది కమల్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.దీంతో లోకేష్ నెక్స్ట్ తీయబోయే విజయ్ సినిమాపై ముందుగానే అంచనాలు పెరిగి పోయాయి.

Telugu Kamal Haasan, Kollywood, Thalapathy-Movie

ఇక ఈ సినిమా అధికారికంగా కూడా ప్రకటించారు.అప్పటి నుండి ఈ సినిమా గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది.తాజాగా దళపతి67 లో కమల్ హాసన్ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో నటించే అవకాశం ఉంది అని.విక్రమ్ లో సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ కంటే ఈ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుంది అని కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది.కాగా ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube