రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి మూవీ, ప్రాజెక్ట్ కె ల మీద ఫోకస్ పెట్టాడు.ఆల్రెడీ ప్రశాంత్ వర్మ తో చేస్తున్న సలార్ ముగింపు దశకు చేరుకుంది.
ఆదిపురుష్ లేట్ అవుతుండటం వల్ల సలార్ నే ముందు రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు ప్రభాస్.ఇక ఈ క్రమంలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ తో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
స్పిరిట్ అంటూ రాబోతున్న ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.స్పిరిట్ సినిమా గురించి నిర్మాత భూషణ్ కుమార్ ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.
సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్తుందని.సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అన్నారు.ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు సందీప్ వంగ.అర్జున్ రెడ్డితోనే డైరెక్టర్ గా తన సత్తా చాటిన సందీప్ వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తున్నాడు.రణ్ బీర్ కపూర్ హీరోగా చేస్తున్న యానిమల్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.
.