మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదం ఏనాటి నుంచో ఉంది.13.37 ఎకరాల భూమి యాజమాన్యానికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది.అక్టోబరు 12, 1968న శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందంలో 13.7 ఎకరాల స్థలంలో గుడి, మసీదు రెండింటినీ నిర్మించాలని ఒప్పందం జరిగింది.శ్రీకృష్ణ జన్మస్థానానికి 10.9 ఎకరాల భూమి, షాహీ ఈద్గా మసీదుకు 2.5 ఎకరాల భూమి యాజమాన్యం ఉంది.షాహీ ఈద్గా మసీదును అక్రమంగా నిర్మించారని హిందూ పక్షం చెబుతోంది.
షాహీ ఈద్గా మసీదును తొలగించి ఈ భూమిని శ్రీకృష్ణ జన్మస్థలానికి ఇవ్వాలని హిందువుల తరఫు నుంచి డిమాండ్ వచ్చింది.
పిటిషనర్ లాయర్ మహేంద్ర ప్రతాప్ సింగ్ తన అప్పీల్లో శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాంగణం నుండి షాహీ మసీదు ఈద్గాను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంలో సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ద్వారా మొదటి తెలుసుకోవలసిని అంశాలపై ఇప్పటికే విచారణ జరిగింది.ఈ కేసులో డిసెంబర్ 8న హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఢిల్లీ నివాసి ఉపాధ్యక్షుడు సూర్జిత్ సింగ్ యాదవ్ 13.37 ఎకరాల్లో నిర్మించిన ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈద్గాను నిర్మించారని కోర్టుకు తెలియజేశారు.
1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ వర్సెస్ షాహీ మసీదు ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా పిటిషన్లో సవాలు చేశారు.సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ III సోనికా వర్మ కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశారు.మథురలోని షాహీ ఈద్గా మసీదు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి వస్తుంది.
ఇప్పటివరకు వివిధ కోర్టులలో ఈ విషయంలో 13 కేసులు దాఖలు చేశారు.వాటిలో రెండు కేసులు కూడా కొట్టివేయబడ్డాయి.
సర్వే నివేదిక సమర్పించాలి
మథుర సీనియర్ డివిజన్ జడ్జి కృష్ణ జన్మస్థాన్ సమీపంలోని వివాదాస్పద భూమిని అమీన్ తనిఖీకి ఆదేశించారు.జనవరి 2 నుంచి సర్వే ప్రారంభమైంది.షాహీ ఈద్గాకు చెందిన అమీన్ నివేదికలో 13.3 ఎకరాల భూమి సర్వేతోపాటు మ్యాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.జనవరి 20లోగా అమీన్ ఈ నివేదికను కోర్టుకు సమర్పించాల్సిఉంటుంది.