బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తన మొదటి చిత్రం కహో నా ప్యార్ హైతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ పేరు తెచ్చుకున్నాడు.అతని లుక్స్, యాక్టింగ్, డ్యాన్స్ చూసి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వెర్రివాళ్లయిపోయారు.
ఒకటి కాదు రెండు కాదు వేల మంది అమ్మాయిలు హృతిక్. నన్నుపెళ్లి చేసుకోవా…అంటూ ప్రపోజల్స్ పంపారు.హృతిక్ 1974 జనవరి 10న ముంబైలో జన్మించాడు.హృతిక్ రోషన్ తండ్రి సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్.ఈ అందమైన హీరో పూర్తి పేరు హృతిక్ రాకేష్ నగ్రత్. 1980లో విడుదలైన ఆశా చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.
ఈ చిత్రం అతని నటనా వృత్తికి ఊతం ఇచ్చింది.అతను పెరిగేకొద్దీ నటన, సినిమాపై మరింత మక్కువ పెంచుకున్నాడు.హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కహో నా ప్యార్ హై చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు.
చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్
ఇప్పటికీ బుల్లితెరలో ప్రసారమైనప్పుడల్లా సంచలనం సృష్టించే సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సినిమాలు కహో నా ప్యార్ హై, ఆప్ ముజే అచ్చే లగ్నే లగే నుండి ధూమ్ 2, జోధా అక్బర్, సూపర్ 30, వార్, క్రిష్ సిరీస్, బ్యాంగ్ బ్యాంగ్, అగ్నిపథ్ ఇలా చాలా ఉన్నాయి.
హృతిక్ ఒక గ్రీకు దేవుడు
హృతిక్ ముఖాకృతి, ఆకుపచ్చ కళ్ళు మొత్తంగా చూస్తే గ్రీకు దేవుడిని తలపిస్తుంది.అందుకే అతన్ని బాలీవుడ్‌లో గ్రీక్ గాడ్ అని కూడా పిలుస్తారు.బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లో కూడా అతని లుక్స్‌కి, స్టైల్‌కి ఫిదా అయిపోతుంటారు హృతిక్‌కి చిన్నతనంలో నత్తిగా మాట్లాడేవాడు.చిన్నతనంలో నత్తిగా మాట్లాడే ఈ కుర్రాడు ఒకరోజు ప్రపంచంలోని అందరి హృదయాలను శాసిస్తాడని ఎవరూ అనుకోలేదు.హృతిక్ ఆరు ఫిల్మ్‌ఫేర్, నాలుగు ఉత్తమ నటుడుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు.2019 సంవత్సరంలో అతను సెక్సీయెస్ట్ ఆసియన్ పురుషుడిగా గుర్తింపు పొందాడు.2019లో ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగానూ ఎంపికయ్యాడు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా.
1980లో హృతిక్… జితేంద్ర, రీనా రాయ్ నటించిన ఆశా చిత్రంలో ఒక పాటలో కనిపించాడు.అందుకుగాను అతని తాత 100 రూపాయలను హృతిక్‌కి పారితోషికంగా ఇచ్చారు.
దీని తర్వాత ఆప్ కే దీవానే చిత్రంలో హృతిక్ తన తండ్రి చిన్ననాటి పాత్రను పోషించాడు.అతను తన తండ్రితో కలిసి ఖుద్గర్జ్, కింగ్ అంకుల్, కరణ్ అర్జున్, కోయిలా వంటి చిత్రాలలో సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
హృతిక్ యాక్టింగ్ టీచర్ కిషోర్ నమిత్ కపూర్ దగ్గర యాక్టింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.