బంధం బహిరంగమే...కానీ పెళ్ళికి అడ్డుపడుతున్న శక్తులు ఎవరు ?

ఈ రోజు క్రిస్మస్ వేడుకల తర్వాత టాలీవుడ్ లో మరొక వాడి వేడి చర్చ సాగుతుంది.అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ అప్ డేట్ తో మళ్లి మీడియా వారికి పని దొరికింది.

 Adavi Sesh Supriya Relationship Status Details, Adivi Sesh, Supriya, Adavi Sesh-TeluguStop.com

క్రిస్మస్ వేడుకల్లో అక్కినేని వారసులంతా కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటో ఒకటి వదలగానే అది వైరల్ అయ్యింది.ఎందుకంటే అక్కినేని కుటుంబం వారసులు జరుపుకుంటున్న సెలబ్రేషన్స్ లో ఒకే ఒక్క అవుట్ సైడర్ అడవి శేష్.

నాలుగేళ్ళుగా అడవి శేష్, సుప్రియ జంట పై రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయ్.కానీ ఎవరు కండించడం లేదు.

పైగా మనం అవుట్ సైడర్ అని అనుకున్న అక్కినేని కుటుంబం మాత్రం ఆలా భావించడం లేదు.అందుకే యంగ్ జెనరేషన్ చేసుకున్న ఈ పార్టీ లో అడవి శేష్ కనిపిస్తున్నాడు.

పోనీ ఇంత థిక్ ఫ్రెండ్ షిప్ ఉంది పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు.వీరి పెళ్లి కి అడ్డు పడుతునం శక్తులు ఎవరు అనేది అందరిని వేధిస్తున్న ప్రశ్న.

ఇక చరణ్ రెడ్డి అనే నటుడిని పెళ్లి చేసుకొని పాపా పుట్టాక విడిపోయి సింగిల్ గానే ఉంటుంది సుప్రియ. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటుంది.ఆమె ఒక బిజినెస్ విమెన్. ఆమె నిర్ణయాన్ని కూడా అక్కినేని ఫ్యామిలీ వ్యతిరేఖించదు.

అంత సీన్ కూడా లేదు.

మరి ఆ మధ్య బాలయ్య షో లో అడవి శేష్ ని పెళ్లి ఎప్పుడు అంటే పక్కనే ఉన్న శర్వా పైన తోసేసి సరదాగా ఆ విషయాన్నీ ముగించేశాడు.అలాగే గూఢచారి లో వీరిద్దరూ కలిసి మొదటి సారి నటించారు.చాల ఏళ్ళ తర్వాత సుప్రియ మళ్లి మొఖానికి మేకప్ వేసింది, ఇక అక్కినేని బ్యానర్ తో అడవి శేష్ ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయబోతున్నాడు.

అన్ని తరచి చూస్తే అడ్డంకులు ఏమి లేవు.కానీ శేష్ కి ఇంట్లో పెళ్లి ప్రెజర్ ఉంది అనే మాట మాత్రం ఖాయం.

మరో వైపు సుప్రియ పెళ్ళికి అంత ఒకే ఉన్నా కూడా చేసుకోకపోవడానికి అడగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే రెండు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.ఒకటి శేష్ కన్నా కూడా సుప్రియ వయసులో ఆరేళ్ళు పెద్దది, పైగా ఆమెకు టీనేజ్ లో ఉన్న కూతురు ఉంది.ఈ రోజు వైరల్ అవుతున్న పిక్ లో కూడా సుప్రియ కూతురు కూడా ఉంది.ఇక రెండో విషయం అంత గ్యాప్ లో ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి శేష్ కుటుంబం కూడా దైర్యం చేయకపోవచ్చు.

ఇక సుప్రియ విషయానికి వస్తే ఇప్పటికే ఒకసారి పెళ్లి విషయంలో తప్పు చేసింది కుటుంబంలో ఎవరికి పెళ్లి పైన మంచి ఉద్దేశం లేదు కాబట్టి ఆమె కూడా తొందరపడకూడదు అని అనుకుంటూ ఉండచ్చు.

Adivi Sesh with Supriya Yarlagadda Photos Viral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube