రైళ్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎందుకు వేగంతో పరిగెడతాయో తెలిస్తే...

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతదేశంలో దాదాపు 68,600 కిలోమీటర్ల మార్గంలో రైలు నెట్‌వర్క్ ఉంది.

 If You Know Why Trains Run Faster At Night Than During The Day.., , Trains , N-TeluguStop.com

ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్ అమెరికాలో 2,50,000 కి.మీ.దీని తరువాత చైనా, రష్యా, భారతదేశం స్థానం వస్తుంది.భారతీయ రైల్వేల గురించి తెలుసుకోవలసిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

రైల్వేల చరిత్ర చాలా పురాతనమైది.భారతీయ రైళ్లలో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తుంటారు.

భారతదేశంలో రైలు మార్గాన్ని బ్రిటిష్ వారు ప్రారంభించారు.మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు రైలులో ప్రయాణించి ఉంటారు.

అయితే పగటిపూట కన్నా రాత్రిపూట రైలు వేగం పెరుగుతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రైలు పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువ వేగంతో నడుస్తుండటాన్ని చాలా మంది గమనించే ఉంటారు.రాత్రిపూట రైళ్లు అతివేగంతో నడపడానికి కారణం ఏమిటి? దీని వెనుకగల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రి వేళల్లో రైలు వేగం పెరగడం వెనుక అనేక కారణాలున్నాయి.

దీనికి మొదటి కారణం.

రాత్రి వేళల్లో రైల్వే ట్రాక్‌పై కదలికల పరిధి దాదాపు తక్కువగా ఉండడమే.చీకటి పడితే రైల్వే ట్రాక్‌పై మనుషులు, జంతువుల సంచారం ఉండదు.

అంతే కాకుండా రాత్రి వేళల్లో ట్రాక్‌పై ఎలాంటి నిర్వహణ పనులు కూడా జరగగవు.దీని కారణంగా రాత్రి వేళల్లో రైలు వేగం ఎక్కువగా ఉంటుంది.

చీకట్లో రైలును నడపడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, చాలా దూరం నుండి సిగ్నల్స్ చూడవచ్చు.రైలును ఆపివేయాలా వద్దా అనేది రైలు డ్రైవర్‌కి అంటే లోకో పైలట్‌కి దూరం నుండే తెలిసిపోతుంది.

Telugu America, China, Fast, Indian Railways, Loco Pilot, Railway Signal, Railwa

దీంతో లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు.దీంతో రాత్రిపూట రైలు నిరంతరంగా అధిక వేగంతో నడుస్తుందని అర్థం చేసుకోవచ్చు.పగటిపూట ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల ఎక్కువ సమయం పడుతుంది.ఉదయం వేళ రైల్వే ట్రాక్‌పై ఎవరో ఒకరు తిరుగుతుంటారు.అటువంటి పరిస్థితిలో లోకో పైలట్ పగటిపూట మరింత అప్రమత్తంగా రైలును నడపాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube