పాకిస్థాన్ మంత్రి భుట్టోపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రపంచానికి భారత్ విశ్వ గురువు, పాక్ విష గురువు అని అన్నారు.
పాక్ మంత్రి వ్యాఖ్యలను భారతీయులు ఖండించాలని చెప్పారు.తన తల్లిని చంపిన టెర్రరిస్టుల నీడలో పాక్ మంత్రి భుట్టో ఉన్నారని ఆరోపించారు.
పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు.సర్జికల్ స్ట్రైక్ జరగకూడదంటే పాక్ జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.