కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదని కోమటిరెడ్డి ఫిక్స్ అయ్యారని సమాచారం.
ఈ క్రమంలోనే తన కుమారుడు ప్రదీప్ చారిటీ పేరు మీద కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు పరిమితం కావాలనే యోచనలో ఉన్నారు.ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన పలు కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కనిపించలేదన్న విషయం తెలిసిందే.
తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం అయ్యారు.ప్రస్తుతం పార్టీలో పరిస్థితులను వివరించిన వెంకట్ రెడ్డి తనకు పదవులు కొత్త కాదని తెలిపారు.
అయితే ఒకసారి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించడం, మరోసారి నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు.తాజాగా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెబుతుండటంతో కోమటిరెడ్డి రాజకీయ భవిష్యత్ పై సందిగ్ధత ఏర్పడింది.