అంబులెన్స్ ఎత్తుకుపోయిన 13 ఏళ్ల బాలుడు.. వెంటాడి పట్టుకున్న పోలీసులు

పిల్లలు చేసే అల్లరి ఒక్కోసారి శృతి మించుతుంటుంది.అలాంటి సందర్భాల్లో పెద్దలు వారిని మందలిస్తుంటారు.

 13 Years Old Boy Steals Ambulance From Hospital In Kerala Details, Viral Lates-TeluguStop.com

ఒక్కోసారి వారిని కొన్ని దెబ్బలు కొట్టి అయినా అదుపు చేస్తుంటారు.అయితే కొన్ని సంఘటనల్లో పెద్దలు షాక్ అవుతుంటారు.

పిల్లలను ఏం అనాలో కూడా వారికి అర్ధం కాదు.అంతలా పిల్లలు చేసే అల్లరి ఉంటుంది.

ఇదే తరహాలో ఓ బాలుడు కొంటె పని చేశాడు.జ్వరం వచ్చిందని బాలుడిని అతడి తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

జ్వరం తగ్గగానే ఆసుపత్రిలో కనిపించిన అంబులెన్స్‌ను ఎత్తుకుపోయాడు.చివరికి పోలీసులు పెద్ద ఎత్తున గాలించి, అతడిని వెంబడించి పట్టుకున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

కేరళలోని త్రిసూర్ జనరల్ హాస్పిటల్‌లో సోమవారం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.13 ఏళ్ల బాలుడు త్రిసూర్ జనరల్ హాస్పిటల్ ముందు ఆగి ఉన్న అంబులెన్స్‌ను దొంగిలించాడు.దానిని 8 కిలోమీటర్లు నడిపాడు.

సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆసుపత్రిలో పని చేసే ఉద్యోగి కుమారుడు, గత నాలుగు రోజులుగా జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతడికి వైద్యులు తగిన చికిత్స అందించడంతో క్రమంగా కోలుకుంటున్నాడు.

Telugu Boy, Boysteals, Ambulane, Kerala Thrissur, Latest Coverage, Latest-Latest

ఈ తరుణంలో అంబులెన్స్ డ్రైవర్ బిజో వాహనం లోపల కీ వదిలేసి వాటర్ తాగేందుకు పక్కకు వెళ్లాడు.అంబులెన్స్‌లో కీ ఉండడం చూసిన ఆ బాలుడు వెంటనే అందులోకి ఎక్కాడు.క్షణాల్లో అక్కడి నుంచి అంబులెన్స్‌ను నడుపుకుంటూ 8 కిలోమీటర్లు వెళ్లిపోయాడు.

అంబులెన్స్ డ్రైవర్‌ స్థానంలో బాలుడు ఉండడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.పోలీసులకు సమాచారం అందించారు.

ఈ లోపు అంబులెన్స్ డ్రైవర్ కూడా అంబులెన్స్ మాయం అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు అంబులెన్స్ ను వెంబడించి పట్టుకున్నారు.

బాలుడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.ఈ ఘటన బయటకు తెలియగానే బాగా వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube