తమ ఒక చర్మం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకోని వారుండరు.అందులోను ఏదైనా ఫంక్షన్ కు లేదా పెళ్లికి వెళ్తున్నారంటే అందరిలోనూ తామే స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాలని తహతహలాడుతున్నారు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే తెల్లటి మెరిసేటి ముఖ చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక మీడియం సైజు క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి సన్నటి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ స్లైసెస్, ఒక కప్పు పచ్చి పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో క్యారెట్ పాలను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి, వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని కలుపుకోవాలి.చివరిగా సరిపడా క్యారెట్ పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చర్మం పై పేరుకుపోయిన డస్ట్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.మరియు ఈ రెమెడీని రెండు రోజులకు ఒకసారి పాటిస్తే చర్మం టైట్ గా మారుతుంది.
పిగ్మెంటేషన్ సమస్య నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.