స్టార్ హీరో బాలకృష్ణ సాధారణంగా కూల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.అయితే బాలయ్యకు కోపం వస్తే మాత్రం ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడం సులువు కాదని చాలామంది చెబుతారు.
అయితే స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి షూట్ లో పాల్గొంటుండగా క్యాస్టూమ్ వర్కర్ పై ఆయన ఫైర్ అయ్యారని సినీ వర్గాల్లో వినిపిస్తూ ఉండటం గమనార్హం.
షూటింగ్ లొకేషన్ లో ప్రొడ్యూసర్లు లేకపోవడంతో ఆ కోపాన్ని బాలయ్య క్యాస్టూమ్ వర్కర్ పై చూపించారని సమాచారం అందుతోంది.
క్యాస్టూమ్ వర్కర్ పై బాలయ్య సీరియస్ అయిన తర్వాత షూటింగ్ లొకేషన్ కు నిర్మాత రాగా ఆ నిర్మాతపై కూడా బాలకృష్ణ సీరియస్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.వీరసింహారెడ్డి ప్రమోషన్స్ విషయంలో బాలయ్య ఫీలవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వీరసింహారెడ్డి సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ ఆశించిన స్థాయిలో లేదని కామెంట్లు వినిపిస్తుండటం కూడా బాలయ్య అభిమానులను బాధ పెడుతోంది.జనవరి సెకండ్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
సంక్రాంతి పండుగ సమయంలో ఏ సినిమా ఫస్ట్ థియేటర్లలో రిలీజ్ కానుందో స్పష్టత రావాల్సి ఉంది.
వీరసింహారెడ్డి సినిమా సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.బాలయ్య ఈ సినిమాలో కూడా ఊరమాస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.ఈ సినిమాలో శృతి హసన్ పాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
బాలయ్య 12 కోట్ల రూపాయల పారితోషికం ఈ సినిమాకు తీసుకున్నారు.అఖండ మూవీ సక్సెస్ వల్ల బాలయ్య ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని వినిపిస్తోంది.
వీరసింహారెడ్డి మూవీ సీడెడ్ హక్కులు ఏకంగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.