మన స్వేచా భారత దేశంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పెద్దగా పట్టించుకోదు మన భారత దేశం, ఏ తీరున వ్యవహరించినా మనోళ్ళే గా పోనీలే అని ఊరుకుంటుంది.ఇదే అదునుగా చూసుకుని కొందరు సొంత దేశాన్నే ఇష్టా రాజ్యంగా తిడుతుంటారు, ఎక్కడి నుంచో వలసలు వచ్చిన వాళ్ళు, ఏళ్ళ తరబడి ఇక్కడే పాతుకుపోయి మన దేశాన్నే తూలనాడుతుంటారు అయినా మన దేశం అందరిని ఆదరిస్తుంది, పరిమితి దాటితే తీసుకునే చర్యలు కూడా చిన్నగానే ఉంటాయి.
అయితే ఒక్క సారి మన దేశం దాటి బయటి దేశాలకు వెళ్తే మాత్రం నోరు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదంటే ఆయా దేశాలు విధించే శిక్షలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి.ముఖ్యంగా భారత్ నుంచీ అత్యధిక శాతం మంది కార్మికులుగా వలసలు వెళ్ళేది అరబ్బు దేశాలకే.
అరబ్బు దేశాలలో ఎన్నో రూల్స్ ఉంటాయి.మరీ ముఖ్యంగా సౌదీ లో ఈ రూల్స్ మరీ దారుణంగా ఉంటాయి.
ఒక సారి అక్కడికి ఉద్యోగం చేయాలని వెళ్ళే వారు తప్పకుండ అక్కడి నిభందనలు తెలుసుకోవాల్సిందే.లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
తాజాగా సౌదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రూల్ ఇప్పుడు ఈ చర్చకు కారణం అయ్యింది.అదేంటంటే.
సౌదీ లో అడుక్కోవం చాలా పెద్ద నేరం, చాలా చోట్ల భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు కానీ సౌదీ లో మాత్రం అలాంటి వాళ్ళు కనపడరు ఒక వేళ అలా కనిపిస్తే మాత్రం తీసుకుపోయి జైలు లో వేస్తారు.ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డొనేషన్స్ చాలా మంది అడగడం ఆ విషయాన్ని వైరల్ చేయడం డబ్బులు భాదితులకు ఇవ్వడం జరుగుతోంది, అయితే సౌదీ ఇలాంటి వాటిని కూడా బిక్షాటనగానే పరిగణిస్తోంది.ఇకపై ఎవరైనా సరే ఆన్లైన్ లో డబ్బుల కోసం పోస్ట్ లు పెట్టినా అలా ప్రేరేపించినా సరే వారు సౌదీ చట్టాలను బ్రేక్ చేసినట్టేనని అలాంటి వారికి సుమారు 6 నెలల జైలు శిక్షతో పాటు దాదాపు రూ.10 లక్షల జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది సౌదీ ప్రభుత్వం.కాబట్టి సౌదీ వెళ్ళాలనుకునే వారు కానీ , వెళ్ళిన వారు కానీ ఇలాంటి నిభందనలు తెలుసుకుని మసులుకోవడం ఎంతో మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.