Sajjala Ramakrishna Reddy : ఇప్పటం విషయంలో హైకోర్టు తీర్పు టీడీపీ, జనసేనకు చెంపపెట్టు: సజ్జల రామకృష్ణారెడ్డి

ఇప్పటం విషయంలో హైకోర్టు తీర్పు టీడీపీ, జనసేనకు చెంపపెట్టు: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణరెడ్డి మీడియాతో మాట్లాడిన పాయింట్స్:అబద్దాలతో కోర్టును తప్పు పట్టించినందుకు జరిమానాలు ఇప్పటం అంశాన్ని ఇంటర్నేషనల్ సమస్యగా టిడిపి- జనసేన- ఎల్లో మీడియా చిత్రీకరించాయి టీడీపీకి తెలిసిన ఏకైక విద్య తప్పుడు ప్రచారం లేని సమస్యను సృష్టించి ఎల్లోమీడియా, చంద్రబాబు ప్రభుత్వంపై విషం.మీడియాతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… ఆయన ఏమన్నారంటే…

 The High Court's Verdict In This Matter Is A Blow To Tdp And Janasena Sajjala Ra-TeluguStop.com

టీడీపీ ఎల్లోమీడియా సాయంతో దారుణమైన అసత్యాలను ప్రచారం చేస్తుంది.

రోజువారీగా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.చేతగాని టీడీపీకి తెలిసిన ఏకైక విద్య తప్పుడు ప్రచారం చేయడమే.

కల్పితమైన కథలతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ సభకు భూములిచ్చిన వారి ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందని అబద్ధపు ప్రచారం అల్లారు.

ఈరోజు హైకోర్టు విచారణతో అసలు నిజం బయటపడింది.ఇప్పటంలో ఏం జరిగిందనేది తెలుసుకోకుండా.

పవన్‌ కళ్యాణ్‌ ఆక్రోశం వెళ్లగక్కడం విచారకరం.ఆక్రమణల తొలగింపునకు మార్చిలోనే నోటీసులిచ్చిన సంగతి ఆరోజే వెల్లడైంది.

అసలు, ఆక్రమణల తొలగింపునకు నోటీసులతో పనిలేకుండానే చర్యలు చేపట్టే హక్కు, బాధ్యత ప్రభుత్వానికుంటుంది…

ఇప్పటం ఇష్యూని ఇంటర్నేషనల్‌ స్థాయి వార్తగా గొడవచేసినప్పటికీ ఆ రోజే నిజాలు బయటకొచ్చాయి.లేనిపోని అబద్ధాలను క్రియేట్‌ చేసి కరపత్రాలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయని.

పొలిటికల్‌ విష ప్రచారానికి టీడీపీ, పవన్‌కళ్యాణ్‌లు ప్రయత్నాలు చేశారు.నేడు హైకోర్టు మొట్టికాయలతో వాళ్ల ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

అబద్ధాలతో కోర్టును కూడా తప్పుదోవపట్టించినందుకు జరిమానా విధించడంతో మరోమారు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ విషప్రచారం తేటతెల్లమైంది.ప్రతీ చిన్నవిషయాన్ని కూడా బ్యానర్‌లు చేసి వార్తలు ప్రచురిస్తూ చంద్రబాబుకు వంతపాడుతున్న ఎల్లో పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల విశ్వసనీయతను ప్రజలు అర్ధం చేసుకోవాలి.

ఆ రెండు పత్రికల తప్పుడు రాతల్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube