India Constitution: రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రాథమిక స్థాయి నుండి పీజీ స్థాయి వరకు రాజ్యాంగాన్ని కంపల్సరీ పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి పౌరులకు రాజ్యాంగంపై అవగాహన కలిగించాలి.భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చి75 సంవత్సరాలై ఆజాద్ కా అమృతోశ్చవాలు జరుపుకుంటున్నప్పటికి జనబాహుళ్యంలో ఆశించిన మేరకు రాజ్యాంగం గురించిన అవగాహన పరిజ్ఞానం ప్రచారం చేయడములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి.

 The Constitution Should Be Introduced As A Curriculum Details, India Constitutio-TeluguStop.com

రాజ్యాంగంలోని అంశాలు స్థానిక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఏరుపాటు చట్టసభలు అభ్యర్థుల ఎన్నిక విధానం రాష్ట్రపతి ,ఉపరాష్ట్రతి ఎన్నిక గవర్నర్ల నియామకం కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అంశాల పట్ల అవగాహన ఎన్నికల సంఘం సుప్రీమ్ కోర్ట్ హై కోర్టు లకు జడ్జీల నియామకం ప్రభుత్వాల ఏర్పాటు.చట్టాలు ప్రాథమికహక్కులు పౌరహక్కుల రాజకీయ సామాజిక భద్రత చట్టాలపట్ల ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం జరుగలేదు.

రాజ్యాంగం బ్రహ్మ పదార్థం రాజ్యాంగం అంటేజనబాహుళ్యంలో ఆశించిన మేరకు అయింది.

రాజ్యాంగ మంటే అంబెద్కర్ రచించాడు అని మాత్రమే చాలా మందికి తెలుసు.

రాజ్యాంగం ప్రజలకు అవగాహన కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఇచ్చి పౌరసత్వ గుర్తింపు ఇచ్చినట్లే ప్రతి పౌరునికి రాజ్యాంగాన్ని ఉచితంగా అందించాలి.రోడు మీద భగవత్గీత బైబిల్ కురాన్ మత గ్రంథాలను ఉచితంగా లేదా తక్కువ ధరలకు అమ్మి నట్లు రాజ్యాంగాన్ని వాడుకబాషలో ప్రింట్ చేసి ప్రజలకు పంచిపెట్టాలి.

రాజ్యాంగ పట్ల అవగాహన చైతన్య సదస్సులు , చర్చలు నిర్వహించాలి .వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కళారూపాల ద్వారా వాడుక బాషలో నాటక ప్రదర్శన ద్వారా గ్రామీణులకు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించాలి.రాజ్యాంగం విశ్వసనీయత ఇటీవల రాజ్యాంగాన్నిమార్చాలనిరద్దుచేయాలని అడ్డదారిలో రాజ్యాంగాన్ని నిట్టనిలువునా చీల్చే వ్యూహాలను నిలువరించాలి .జాతీయ స్థాయిలో చర్చలు వాదోప వాదాలు జరుగుతున్నాయి.

Telugu Babasaheb, India, India Awareness, India Curriculu, India Subject, Suprem

సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక స్వామ్యవాధ లక్ష్యాల అమలుతోనే సామాజిక ఆర్థిక న్య్యాయం సిద్ధిస్తుంది.ప్రపంచ చరిత్రలోనే అరుదైన అపురూప రాజ్యాంగాన్ని చట్టాలను రక్షించే పరిజ్ఞానం అవగాహన చైతన్య ము వచ్చినప్పుడే రాజ్యాంగ ఫలాలు పేదవర్గాలకు అందుతాయి.చట్టాలు పేదవర్గాలకు చుట్టాలు అనే విశ్వసనీయత ప్రజల్లోనెలకొనే విధంగా ప్రభుత్వం వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి.ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర చరిత్ర లో అధికారంలో వున్న పార్టీలు ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా పాలనా వ్యవహారాలను నిర్వహిస్తే ఆశించిన ప్రజా సంక్షేమము సామాజిక ఆర్థిక ప్రగతి సిద్దించేది.

ప్రజలలో రాజ్యాంగ అంశాలు ఆర్టికల్స్ పట్ల అవగాహన పరిజ్ఞానంవుంటే ప్రగతిశీల సమాజము ఆవిర్భవిస్తుంది.నిజానికి రాజ్యాంగం గురించి తెలిస్తే ప్రజలు పాలకులను ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తారు.

పాలనలో పౌరుల సంపూర్ణ భాగస్వామ్యం పెరిగి రాజ్యాంగ పీఠికలో పేరుకొన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం సిద్ధించి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో అందరికీ సమాన అవకాశాలు కలిగి సామాజిక న్యాయం పంపిణీ న్యాయం జరుగుతుంది.

Telugu Babasaheb, India, India Awareness, India Curriculu, India Subject, Suprem

రాజ్యాంగం పట్ల అవగాహన పరిజ్ఞానం వున్న ప్రజలు అంటే అధికారంలో వున్న రాజకీయ పార్టీకి అధికారంలో వున్న ప్రభుత్వాలకు పాలక‌వర్గాలకు ప్రభుత్వ యంత్రాంగానికి భయం నెలకొనిది .ప్రజాసమస్యల పరిష్కారదిశగా దృష్టి పెట్టకుండా ప్రజలను” మాటల మాయా ప్రపంచంలోకి నెట్టి వేస్తూ ప్రజల దృష్టిని సమస్యల పరిష్కారము కొరకు కాకుండా కాలయాపన చేస్తున్నారు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.రాజ్యాంగంలో పేరుకొన్న సంక్షేమ రాజ్య స్థాపన సంక్షోభాలను నిలయం కావడం శోచనీయం రాజ్యాంగం మేధావులు దేశములో కొంత మంది మేధావులకు మాత్రమే రాజ్యాంగం మీద అవగాహన వుంది.

దేశంలో రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహన వున్న అడ్వకేట్స్ సంఖ్య కొద్దిగానే వుంది.విద్యావంతుల మేధావుల రాజ్యాంగ నిపుణుల సూచనలు సలహాలు పాటించే పాలకులు ప్రభుత్వాలు అధికారంలో వున్న రాజకీయ పార్టీలకు శ్రద్ధ లోపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube