టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.ఈయన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా షూటింగ్ సమయంలో ప్రమోషన్ల కోసం చేసినటువంటి ఒక ఫ్రాంక్ వీడియో పెద్ద ఎత్తున వివాదాలకు కారణమైంది.
ఈ క్రమంలోనే ఈయన యాంకర్ దేవి నాగవల్లితో కూడా పెద్ద ఎత్తున గొడవకు దిగారు.ఇలా ఈ వివాదం పలు చర్చలకు దారితీసింది.
ఇక ఈ వివాదం ముగిసిన అనంతరం ఈయన ఓరి దేవుడా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే యాక్షన్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఆయన నిర్మాణంలో తన కుమార్తెను మొదటిసారి తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలని భావించారు.
ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య సరసన విశ్వక్ ను హీరోగా ఎంపిక చేశారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని షూటింగ్ ప్రారంభించే సమయంలో తాను సినిమా షూటింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు విశ్వక్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఈ విషయం పట్ల వివాదం చెలరేగింది.
ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే విశ్వక్ ఇకపై తన సినీ కెరియర్ కాస్త ఇబ్బందులలో పడుతుందని అందరూ భావించారు.అయితే ఈయన మాత్రం వరుస సినిమాలకు కమిట్ అవుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.ఇప్పటికే విశ్వక్ స్వీయ దర్శకత్వంలో దస్ కా దమ్కీ అనే సినిమా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.ఇక తాజాగా ఈ సినిమా నుంచి నందమూరి బాలకృష్ణ చేతుల మీద ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా జరిగింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.పలాస ఫేమ్ దర్శకుడు కరణ్ కుమార్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో విశ్వక్ హీరోగా మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇలా వరుస వివాదాలను ఎదుర్కొంటూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు విశ్వక్ లక్ మామూలుగా లేదు.ఈయన నక్క తోక తొక్కారంటూ కామెంట్లు చేస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.