Ram Charan NTR: చరణ్ కోసం అలాంటి త్యాగం చేసిన ఎన్టీఆర్.. నిజంగా గ్రేట్!

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రేక్షకులకు చూపించారు.

 Ram Charan Doing Movie Rejected By Ntr With Director Buchhi Babu Details, Ntr ,-TeluguStop.com

అయితే సినిమాలో చూపించినది కేవలం కొంత మాత్రమే కానీ నిజ జీవితంలో మాత్రం వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ హీరోలు తెలియజేశారు.ఇకపోతే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం మరోసారి బయటపడింది.

రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ ప్రశాంత్ నీల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలో ప్రకటన మాత్రమే వచ్చినప్పటికీ ఇంకా షూటింగ్ పనులు ప్రారంభించుకోలేదు.

ఇక రామ్ చరణ్ మాత్రం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు.అదే విధంగా ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయింది.

ఇకపోతే ఎన్టీఆర్ లిస్టులో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.బుచ్చిబాబు ఎన్టీఆర్ ను కలిసి తనకు స్టోరీ లేని వినిపించగా ఎన్టీఆర్ ఈ సినిమా నాకన్నా రామ్ చరణ్ కు బాగా సూట్ అవుతుందని చెప్పారట.

Telugu Charan, Buchhi Babu, Ntr, Ram Charan, Ramcharan, Tollywood-Movie

ఈ క్రమంలోనే బుచ్చిబాబు ఇదే స్టోరీలాంటి రామ్ చరణ్ కి చెప్పగా స్టోరీ లైన్ నచ్చడంతో రామ్ చరణ్ వెంటనే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ విధంగా ఎన్టీఆర్ తనకు వచ్చిన సినిమా అవకాశాన్ని రామ్ చరణ్ కోసం వదులుకున్నారనీ ఇండస్ట్రీ టాక్.ఆ స్టోరీ రామ్ చరణ్ కైతే ఎంతో బాగుంటుందని ఆయనకు సజెషన్ చేయడంతోనే వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అర్థమవుతుంది.సాధారణంగా ఇలా ఏ హీరో కూడా చేయరు కానీ రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ సినిమాని త్యాగం చేయడం నిజంగా గ్రేట్ అంటూ అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube