చరణ్ కోసం అలాంటి త్యాగం చేసిన ఎన్టీఆర్.. నిజంగా గ్రేట్!
TeluguStop.com
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.
ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రేక్షకులకు చూపించారు.అయితే సినిమాలో చూపించినది కేవలం కొంత మాత్రమే కానీ నిజ జీవితంలో మాత్రం వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ హీరోలు తెలియజేశారు.
ఇకపోతే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం మరోసారి బయటపడింది.రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ ప్రశాంత్ నీల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ఈ సినిమాలో ప్రకటన మాత్రమే వచ్చినప్పటికీ ఇంకా షూటింగ్ పనులు ప్రారంభించుకోలేదు.
ఇక రామ్ చరణ్ మాత్రం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు.అదే విధంగా ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయింది.
ఇకపోతే ఎన్టీఆర్ లిస్టులో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
బుచ్చిబాబు ఎన్టీఆర్ ను కలిసి తనకు స్టోరీ లేని వినిపించగా ఎన్టీఆర్ ఈ సినిమా నాకన్నా రామ్ చరణ్ కు బాగా సూట్ అవుతుందని చెప్పారట.
"""/"/
ఈ క్రమంలోనే బుచ్చిబాబు ఇదే స్టోరీలాంటి రామ్ చరణ్ కి చెప్పగా స్టోరీ లైన్ నచ్చడంతో రామ్ చరణ్ వెంటనే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఈ విధంగా ఎన్టీఆర్ తనకు వచ్చిన సినిమా అవకాశాన్ని రామ్ చరణ్ కోసం వదులుకున్నారనీ ఇండస్ట్రీ టాక్.
ఆ స్టోరీ రామ్ చరణ్ కైతే ఎంతో బాగుంటుందని ఆయనకు సజెషన్ చేయడంతోనే వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అర్థమవుతుంది.
సాధారణంగా ఇలా ఏ హీరో కూడా చేయరు కానీ రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ సినిమాని త్యాగం చేయడం నిజంగా గ్రేట్ అంటూ అభిమానులు భావిస్తున్నారు.
యూకేలో గోమాంసం వడ్డనతో ఆ గుంపు విధ్వంసం.. షాకింగ్ వీడియో లీక్..!!