కేంద్ర హోంశాఖ రేపు కీలక సమావేశం నిర్వహించనుంది.హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఈ సమావేశం ఏర్పాటు కానుంది.
ఈ భేటీకి ఏపీ, తెలంగాణ సీఎస్ లతో పాటు పలు కీలక శాఖల అధికారులు హాజరుకానున్నారు.విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే హోంశాఖ సమావేశాన్ని నిర్వహించనుంది.