తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గౌతమ్ గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న రష్మీ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెర పై పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో రష్మి గౌతమ్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ ట్రాక్ ను సొంతం చేసుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.
ఆ ఎపిసోడ్ కి రాజ్ తరుణ్ అలాగే మోడల్ జెస్సి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇక షో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరూ స్పెషల్ పర్ఫామెన్స్ లు కామెడీ స్కిట్ లతో అదరగొట్టేశారు.ఈ క్రమంలోనే ఒక టాస్క్ లో భాగంగా సోషల్ మీడియాలో వారి గురించి వచ్చే పుకార్లు, వదంతులు, చాలా మంది థంబ్‌నెయిల్స్ ను చూపించి స్పందించాల్సిందిగా కోరారు.
అందులో యాంకర్ రష్మీకి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది.అదేంటంటే ఒక ప్రముఖ హీరో తనకు విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడని, అయితే ఆ విషయం పై రష్మీ స్పందిస్తూ.
అయితే రష్మీ ఆ విషయం గురించి చెప్పబోతూ ఆ హీరో ఎవరు అని అనడంతో వెంటనే అక్కడికి ప్రోమో ని కట్ చేశారు.
అయితే ఈ ప్రోమో పై పలువురు స్పందిస్తూ అవన్నీ ఒట్టి వార్తలే అని కొంతమంది నెటిజన్స్ కొట్టి మానేస్తున్నారు.ఇక ప్రోమోలో కూడా రష్మి అదే మాట చెబుతుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మామూలుగా ప్రోమోలలో ఏడుస్తున్నట్లు కొట్లాడుతున్నట్లు గొడవ పడుతున్నట్లు చూపించడం ఆ తర్వాత అదంతా కామెడీలో భాగమే అంటూ ప్రేక్షకులను పిచ్చివాళ్లను చేయడం ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న విషయమే.
అలానే రష్మి గౌతమ్ కూడా భాగోద్వేగానికి లోనైనట్టు చూపించడం కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే అని అంటున్నారు కొందరు నెటిజన్స్.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియని అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేసి చూడాల్సిందే మరి.