Kalpika ganesh yashoda movie: ప్రెగ్నెంట్ గా నటించడానికి ఒప్పుకున్నది అందుకే.. నటి కల్పికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సమంత నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్క పాత్రలో నటించి సందడి చేశారు నటి కల్పికా గణేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమాలో కూడా నటించి సందడి చేశారు.

 Actress Kalpika Ganesh Interesting Comments On Yashoda Movie Details, Actress Ka-TeluguStop.com

ఈ సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాలో నటించిన పలువురు నటీమణులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నటి కల్పికా గణేషన్ ఈ సినిమాలో తన పాత్ర గురించి తన పాత్ర ప్రాధాన్యత గురించి తెలియజేశారు.యశోద సినిమాలో కల్పికా గణేషన్ గర్భవతి పాత్రలో నటించారు.

అయితే ఇలా ప్రెగ్నెంట్ గా ఈమె నటించడానికి గల కారణాలను ఈ సందర్భంగా తెలియజేశారు.తాను ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించినప్పటికీ యశోద వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని తెలిపారు.

యశోద వంటి అద్భుతమైన కథ అందరికీ తెలియాలని తాను ఈ సినిమాలో గర్భవతి పాత్రలో నటించానని కల్పిక తెలిపారు.

Telugu Actresskalpika, Actress Kalpika, Hari Harish, Kalpika Ganesh, Kalpikagane

ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.ఇక ఈ చిత్రానికి హరి హరీష్ దర్శకులుగా వ్యవహరించారు.ఆదిత్య 369 వంటి అద్భుతమైన సినిమాని అందించిన నిర్మాత శివ లెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా కమర్షియల్ గా ఏ విధమైనటువంటి హిట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube