రాజాసింగ్‌కు ఏడాదిపాటు నిర్బంధం.. కోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.రాజాసింగ్‌ను పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఆయన భార్య ఉషాభాయ్ హైకోర్టులో సవాలు చేశారు.

 Telangana Government Told The Court That Rajasingh Will Be Detained For One Year-TeluguStop.com

జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ సదాశివుని కోర్టులో వాదనలు వినిపించారు.

కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా రాజాసింగ్ టీవీల్లో ప్రసంగించారని, వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీడీ యాక్ట్ కింద నిర్బంధించామని తెలిపారు.ఆయన నిర్బంధాన్ని సలహా మండలి కూడా ఆమోదించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆయనను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఈ నెల 19న జీవో జారీ చేసినట్టు చెప్పారు.మరోవైపు, పిటిషనర్ తరపు న్యాయవాది రామచంద్రరావు తన వాదనలు వినిపిస్తూ.

ప్రభుత్వం చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించి నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.దీంతో కల్పిస్తున్న ధర్మాసనం.

ప్రభుత్వ జీవోను సవాలు చేశారా? అని న్యాయవాదిని ప్రశ్నించింది.సవరణ పిటిషన్ దాఖలు చేస్తామని రామచంద్రరావు చెప్పడంతో కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube