ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న రాజస్థాన్‌ సీఎం

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు సమక్షంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ నేడు ఆవిష్కరించనున్నారు.‘విశ్వాస్ స్వరూపం’ పేరుతో శివుడు ధ్యానముద్రలో ఉన్నట్టు ఈ విగ్రహాన్ని రూపొందించారు.

 The Tallest Shiva Statue In The World Will Be Unveiled Today By Rajasthan Cm-TeluguStop.com

విగ్రహావిష్కరణ సందర్భంగా నవంబరు 6 వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ శివుడి విగ్రహం ఎత్తు 369 అడుగులు,20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది,తత్ పదం సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పాలీవాల్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు.విగ్రహ నిర్మాణంలో 3 వేల టన్నుల ఇనుము, ఉక్కు, 2.5 లక్షల ఘనపు టన్నుల కాంక్రీట్, ఇసుక వినియోగించారు.విగ్రహ నిర్మాణానికి పదేళ్లు పట్టింది,గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా విగ్రహం తట్టుకోగలదు, 250 సంవత్సరాలపాటు చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత బలంగా నిర్మించారు, విగ్రహ ప్రాంగణంలో బంగీజంప్, గో-కార్ట్ తదితర వినోద, సాహస క్రీడల సదుపాయాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube