తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సోమవారం దర్శించుకున్నారు.

 Bjp State General Secretary Vishnuvardhan Reddy Visited Tirumala Srivara ,bjp St-TeluguStop.com

ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆందోళన కలిగించే పరిస్థితి వచ్చాయన్నారు, ప్రాంతీయ పార్టీలు అధికారం ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక రాజకీయాలు అనునిత్యం ప్రజల చర్చలకు తావునిస్తున్నాయన్నారు.40 నెలల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన 2024 అభివృద్ధి ఎన్నికల పైన చర్చ జరగాలన్నారు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు నేతలు ఈ రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించే విధంగా విపక్షాల పైన వలవిసరడం ప్రధాన ప్రతిపక్షాలు గాని ఇతర పార్టీలో గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో టిడిపి పార్టీ చిక్కుకుంటుందని అభిప్రాయపడ్డారు.40 నెలల పాలనలో శాంతి భద్రతల గాని, ఉద్యోగాలు గాని, ఆర్థిక అభివృద్ధి గాని, భావితరాలకు చేయవలసిన అభివృద్ధి కానీ వైసీపీ పాలనలో ఏ ఒకటి జరగలేదన్నారు.రాష్ట్ర ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసారు అన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని టిడిపి 10 సంవత్సరాల వెనక్కి నెట్టితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల 20 సంవత్సరాలు రాష్ట్ర వెనక్కి వెళ్లిందని, అభివృద్ధి అజెండాగా వెళ్లే రాజకీయ పార్టీ బిజెపి,జనసేన ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయబోతున్నామని తెలిపారు.వైయస్సార్సీపి ప్రవేశపెట్టిన నవరత్నాల వైఫల్యం పై ప్రజా ఉద్యమాన్ని చేపడుతుందని తెలిపారు.2024లో ప్రాంతీయ పార్టీల శకం ముగిసే విధంగా బిజెపి జనసేన పార్టీలు ఉద్యమిస్తాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube