ప్రధాని కోసం కాంతార స్పెషల్ స్క్రీనింగ్... ఎప్పుడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది కాంతార సినిమా అని చెప్పాలి.కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకొని మంచి కలెక్షన్లను రాబడుతోంది.

 Rishab Shetty Kantara Special Screening For Pm Narendra Modi Details, Kantara ,k-TeluguStop.com

ఇక ఈ సినిమా చూసిన ఎంతో మంది సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా హీరో రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురిపించారు.

ఇలా కాంతర సినిమా ప్రస్తుతం టాప్ ఆఫ్ ది ఇండియా గా మారిపోయింది.ఈ విధంగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ సినిమాని త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించనున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు.ఈ సినిమా ప్రధానమంత్రి కోసం నవంబర్ 14వ తేదీ స్పెషల్ స్క్రీన్ వేయనున్నట్టు సమాచారం.

ఇక హీరో రిషబ్ శెట్టితో కలిసి ప్రధానమంత్రి ఈ సినిమాని వీక్షించనున్నట్టు తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలువబడునుంది.

Telugu Rishab Shetty, Hombale, Kannada, Kantara, Kgf, Narendra Modi, Prime Modi,

ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ సమస్థ వారు నిర్మించారు.ఈ నిర్మాణ సంస్థలోనే కే జి ఎఫ్ వంటి అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కలెక్షన్లను రాబట్టిందో మనకు తెలిసిందే.ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో కాంతార కే జి ఎఫ్ 2 సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టింది.

కే జి ఎఫ్ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో 75 లక్షల టికెట్లను అమ్ముడుపోగా కాంతార సినిమా మాత్రం 77 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.మొత్తానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube