ప్రధాని కోసం కాంతార స్పెషల్ స్క్రీనింగ్... ఎప్పుడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది కాంతార సినిమా అని చెప్పాలి.

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకొని మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఇక ఈ సినిమా చూసిన ఎంతో మంది సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా హీరో రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురిపించారు.

ఇలా కాంతర సినిమా ప్రస్తుతం టాప్ ఆఫ్ ది ఇండియా గా మారిపోయింది.

ఈ విధంగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ సినిమాని త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించనున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు.ఈ సినిమా ప్రధానమంత్రి కోసం నవంబర్ 14వ తేదీ స్పెషల్ స్క్రీన్ వేయనున్నట్టు సమాచారం.

ఇక హీరో రిషబ్ శెట్టితో కలిసి ప్రధానమంత్రి ఈ సినిమాని వీక్షించనున్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలువబడునుంది. """/"/ ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ సమస్థ వారు నిర్మించారు.

ఈ నిర్మాణ సంస్థలోనే కే జి ఎఫ్ వంటి అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కలెక్షన్లను రాబట్టిందో మనకు తెలిసిందే.ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో కాంతార కే జి ఎఫ్ 2 సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టింది.

కే జి ఎఫ్ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో 75 లక్షల టికెట్లను అమ్ముడుపోగా కాంతార సినిమా మాత్రం 77 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.

మొత్తానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తుందని చెప్పాలి.

ఇండియాలో ఎవ్వరికి లేని క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు డైరెక్టర్స్…