జంతువులతో స్నేహం చేసే అవి మనతో ఎంతో కలిసి మెలిసి ఉంటాయి.ఇలాంటి చాలా వీడియోలు మనకు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి.
ముఖ్యంగా పిల్లలతో ఆడుకుంటూ, పిల్లలు-పెద్దలతో కలిసి పడుకుంటూ, వారికి వివిధ పనుల్లో సాయం చేస్తూ కనిపిస్తుంటాయి.ముఖ్యంగా పెంపుడు కుక్కలను చూస్తే అవి ఇంట్లో మనుషులులా కలిసి పోతాయి.
ఇంటర్నెట్లో అందమైన, ఫన్నీ డాగ్ వీడియోలు ఉన్నాయి.వాటిని చూడగానే అవి ఆటోమేటిక్గా మనల్ని ఆకట్టుకుంటాయి.
కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి.తాజాగా ఓ చిన్నారి బాలుడు తన పెంపుడు కుక్కతో ఫుట్ బాల్ ఆడుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
కుక్కతో ఓ బాలుడు ఫుట్ బాల్ ఆడుతున్న వీడియోను ట్విట్టర్లో బ్యూటెంగేబిడెన్ పేజీలో పోస్ట్ చేశారు.ఆ బాలుడు తన పెంపుడు కుక్కతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఫుట్బాల్ ఆడుతున్నట్లు వీడియోలో ఉంది.ఇక ఆ కుక్క కూడా చాలా చక్కగా ఫుట్ బాల్ ఆడింది.
దాని నైపుణ్యాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.కొన్ని గంటల క్రితం, ఈ వీడియోను షేర చేశారు.దానికి ఇప్పటికే 9.2 లక్షల వ్యూస్, 35,100 పైగా లైక్లు వచ్చాయి.ఆ కుక్క భలే ఫుట్ బాల్ ఆడిందని, నిజంగా దాని నైపుణ్యం చాలా బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.పిల్లల కంటే కుక్క ఆడిన తీరు చాలా బాగుందని, ఖచ్చితంగా ఆడిందని ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.
తెలివైన వారు కలిసి అద్భుతమైన సమయాన్ని గడుపుతున్నారు.ఆనందించండి అని మరొక యూజర్ రాశారు.
కుక్కలు నిజంగా అద్భుతమైనవని, కుక్కతో బాలుడు ఆడుకుంటున్న వైనం చాలా బాగుందని మరికొందరు కామెంట్లు చేశారు.ఈ వీడియో నిజంగా చూడముచ్చటగా ఉంది.
కుక్కలతో స్నేహం చేస్తే, అవి మనుషులతో ఎంత చక్కగా కలిసి పోతాయో, మనుషులు చేసే పనులను అవి కూడా ఎంత చక్కగా చేస్తాయో అర్ధం చేసుకోవచ్చు.