కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ లోని ఉప్పాడలో బాంబు కలకలం చెలరేగింది.పిఠాపురం నియోజకవర్గంలోని యు.
కొత్తపల్లి మండలం అమినాబాద్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో పేలుడు సంభవించింది.దారి మార్గం శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి.
బాధితుడు శ్యామ్ సన్ పాల్ ఫైబర్ బోట్ల యూనిట్ యజమాని ప్రభుదాసుగా గుర్తించారు.అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తపల్లి ఎస్సై రామలింగేశ్వర రావు ప్రమాదంపై ఆరా తీశారు.ఘటనా స్థలానికి అతి సమీపంలో పెట్రోల్ బంక్, బోట్లు తయారు చేసే యూనిట్లు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కాగా గత పన్నెండేళ్ల క్రితం కూడా ఇటువంటి ఘటన జరిగి ఓ వ్యక్తి చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు.