టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో భారీగా అవినీతి జరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు.పేటీఎంకు అజారుద్దీన్ కాంట్రాక్ట్ ఇవ్వడంలోనే అవినీతి ఉందన్నారు.
అజార్ కు టీఆర్ఎస్ ప్రభుత్వ అండ ఉందని విమర్శించారు.ఈ వ్యవహారంపై నిన్నటి వరకు మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.20 నిమిషాల్లో 30 వేల టికెట్లు ఎలా అమ్ముతారని నిలదీశారు.అందరూ కలిసే టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నారని ఆరోపించారు.