చాలా మంది ఇళ్లు అలంకరించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.మరి కొందరు వాస్తు దోషాలు పోవడానికి జంతువులు లేదా, లాఫింగ్ బుద్ద లాంటి విగ్రహాలు పెడుతారు.
ఇక బిజినెస్ పెట్టేవారు ఒకటికి 100 సార్లు ఆలోచించి ఇంట్లో వాస్తుకు సంబంధించినవి కొనుక్కోని పెడుతుంటారు.మరికొందరు ఇళ్లు, కంపెనీని వాస్తుకు అనుకూలంగా మార్చుతారు.
అయితే వ్యాపారంలో రాణించాలంటే.ఆర్థిక నష్టాలు రాకుండా ఎదగాలంటే ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టుకోవాలంట.
దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అయితే ఈ ఒంటె విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం.
ఒంటె విగ్రహం ఉంటే శుభం కలుగుతుందని, చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు.అయితే వ్యాపారం మొదలు పెట్టేవారు తమ బిజినెస్ లో పురోగతి కోసం, ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటారు.
దీని వలన వృత్తిలో విజయం లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతుంటాయి.
అయితే ఈ ఒంటెల విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాటిని పెట్టడానికి సరైన దిశ కూడా ఉండాలంట.లేకపోతే కొత్త సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుందంట.
అందు వలన ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో వాయువ్వ దిశలో ఈ విగ్రహలను పెట్టు కోవడం ద్వారా శుభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు.
ఒంటె విగ్రహం ఇంట్లో పెట్టడం వలన ఎలాంటి ఫలితాలుంటాయంటే.?
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.అలాగే ఎదైనా సమస్యలు తలెత్తుతే, వెంటనే పరిష్కారం అవుతాయి.ఎప్పుడైనా సరే విగ్రహాల పెట్టే సమయంలో సింగిల్‌గా పెట్టకూడదంట, జంటగా పెట్టడం వలన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయంట.ఇంట్లో సంపద వెళ్లి వెరుస్తుందంట.ఎప్పటికీ ఇంట్లో ధనం, ధాన్యంతో పాటు, సంతోషకరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు.