ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 24న విడుదలకానున్న థాంక్ గాడ్ సినిమాకు కువైట్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
అయితే, మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందని అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ క్రమంలో సినిమాపై నిషేధం విధించింది.
అభ్యంతరకరమైన సన్నివేశాన్ని తీసేస్తే.చిత్ర విడుదలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.