సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.సెప్టెంబర్ 16వ తారీకున భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు.
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న ఈయన గత చిత్రం ‘వి’ నిరాశ పర్చింది.దాంతో కాస్త గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు.
సుధీర్ బాబు కు కూడా ఈ సమయంలో ఒక బిగ్ కమర్షియల్ సక్సెస్ పడాలి.కనుక ఈ సినిమా తో ఆయనకు మంచి విజయం దక్కుతుందని అంతా నమ్ముతున్నారు.
సినిమా కు ప్రమోషన్ ముఖ్యం.కనుక ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించాలని సుధీర్ బాబు భావిస్తున్నాడట.
అందుకోసం మహేష్ బాబు ను సంప్రదించగా ఓకే అన్నాడని సమాచారం అందుతోంది.హీరోగా సుధీర్ బాబు నటించిన గత చిత్రాల్లో చాలా సినిమా లకు మహేష్ బాబు ను తెగ వాడేశాడు.
ఇప్పుడు కూడా సుధీర్ బాబు ను కూడా వాడటం మొదలు పెట్టాడు.సుధీర్ బాబు మరియు కృతి శెట్టి నటించడం తో అంచనాలు భారీ గా ఉన్నాయి.పైగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేస్తే కచ్చితంగా అంతకు మించి అన్నట్లుగా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ నమ్మకం తో ఉన్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ వారం పెద్ద సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.కానీ వచ్చే వారం సుధీర్ బాబు సినిమా కు పోటీ లేదు.
కనుక తప్పకుండా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకునే అవకాశం ఉంది.