ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన కేసీఆర్ సర్కార్.. తారక్ తప్పేంటంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అటు సినీ ఇటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న అతికొద్ది మంది హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా పాలిటిక్స్ లోకి తారక్ ఎంట్రీ ఇవ్వాలని రాజకీయాలలో కూడా ఆయన సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 Kcr Sarkar Targets Young Tiger Junior Ntr Details, Junior Ntr, Kcr, Brahmastrame-TeluguStop.com

అయితే తారక్ కొన్నిరోజుల క్రితం అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే.

కారణాలు వెల్లడించకపోయినా అమిత్ షా తారక్ మధ్య రాజకీయాలకు సంబంధించిన చర్చలతో పాటు ఇతర విషయాలకు సంబంధించిన చర్చ జరిగిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తారక్ అమిత్ షాను కలవడంతో బ్రహ్మాస్త్రం ఈవెంట్ ను చివరి నిమిషంలో తెలంగాణ సర్కార్ రద్దయ్యేలా చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ ను పొలిటికల్ గా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Amit Sha, Brahmastra Pre, Brahmastram, Ntr, Ntr Fans, Ntr Amitsha, Rajamo

తారక్ పొలిటికల్ గా ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడలేదు.అమిత్ షా కలిసినా బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నట్టు తారక్ ఎక్కడా వెల్లడించలేదు.బీజేపీకి అనుకూలంగా తారక్ సోషల్ మీడియాలో ఎలాంటి ట్వీట్లు చేయలేదు.అయినప్పటికీ తారక్ ను టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ అధికార పార్టీ తప్పు చేసిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Amit Sha, Brahmastra Pre, Brahmastram, Ntr, Ntr Fans, Ntr Amitsha, Rajamo

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ గేమ్ మొదలైందని ఎన్టీఆర్ కు ఝలక్ ఇవ్వాలనే ఆలోచనతోనే తెలంగాణ సర్కార్ ఈ విధంగా వ్యవహరించిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే బ్రహ్మాస్త్రం సినిమా మాత్రం వార్తల్లో ఈ విధంగా నిలవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.తారక్ అభిమానులకు దూరమయ్యేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరించడం కరెక్ట్ కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కేసీఆర్ సర్కార్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube