నకిలీ పత్రాలతో బ్యాంక్‌కు టోకరా.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు జైలు

నకిలీ పత్రాలతో బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్ట్ 6 నెలల జైలు శిక్ష విధించింది.నిందితురాలిని కిరణ్ కౌర్‌గా గుర్తించారు.

 Indian-origin Woman Sentenced To 6 Months In Jail For Cheating Bank In Singapore-TeluguStop.com

ఆమె ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌ కరోసెల్‌లో ఫాస్ట్ క్యాష్ఉద్యోగం కోసం సెప్టెంబర్ 2018లో ఇచ్చిన ప్రకటన చూసింది.తనకు ఎలాంటి ఉద్యోగం లేదని, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చార్లెస్ అనే వ్యక్తికి చెప్పినట్లు డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధీరజ్ జి చైనాని తెలిపినట్లు ది స్ట్రైయిట్స్ టైమ్స్ నివేదించింది.

అయితే కోర్ట్‌కు సమర్పించిన పత్రాలలో చార్లెస్ తన గుర్తింపును పేర్కొనలేదు.కానీ సిటీ బ్యాంక్ నుంచి రుణం పొందడంలో కిరణ్‌కు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు.

ఆ సమయంలో తాను ఎలాంటి ఉద్యోగం చేయడం లేదని, బ్యాంక్ రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తన వద్ద సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ లేదని నిందితురాలు చార్లెస్‌తో చెప్పినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.

దీనికి చార్లెస్ బదులిస్తూ.

నువ్వేమీ ఆందోళన చెందాల్సిన పని లేదని, బ్యాంక్ రుణానికి అర్హత సాధించేందుకు అవసరమైన ఆదాయ స్థాయిని చూపించాల్సిన అవసరం లేదని ఆమెతో అన్నట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.ఇక తన పథకంలో భాగంగా కిరణ్ కౌర్ వ్యక్తిగత వివరాలను సింగ్‌పాస్ లాగిన్’ద్వారా పొందాడు.

అలాగే రుణ దరఖాస్తుకు అవసరమైన పత్రాలను సేకరించేందుకు ఆర్చర్డ్ రోడ్‌లోని మెక్‌డొనాల్డ్ హౌస్ వద్ద వున్న సిటీ బ్యాంక్ బ్రాంచ్ వెలుపల కిరణ్ గుర్తు తెలియని వ్యక్తిని కలిసిందని ప్రాసిక్యూటర్ నివేదికలో పేర్కొన్నారు.

రుణాన్ని పొందేందుకు గాను కిరణ్ కౌర్ .ఛార్లెస్ చెప్పినట్లే చేసింది.ఇందుకోసం వేరే బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు… ఆ ఏడాది జూలై, ఆగస్టులలో నెలకు 6,700 సింగపూర్ డాలర్లు సంపాదిస్తున్నట్లు తప్పుగా పేర్కొన్న పత్రాలను సంపాదించింది.

అనంతరం 2018 సెప్టెంబర్ 10న రుణ దరఖాస్తును బ్యాంక్‌కు సమర్పించింది.దీనికి తక్షణం ఆమోదం లభించడంతో 13,490 సింగపూర్ డాలర్లను కిరణ్ కౌర్ నగదు రూపంలో పొందింది.

అయితే తాను 4,000 సింగపూర్ డాలర్లను తీసుకుని, మిగిలిన మొత్తాన్ని తనకు నకిలీ పత్రాలు ఇచ్చిన వ్యక్తికి ఇచ్చిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.అయితే అదే ఏడాది అక్టోబర్‌లోనే కిరణ్ కౌర్ మోసం చేసిన విషయాన్ని సిటీ బ్యాంక్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈమె మాత్రమే కాకుండా దాదాపు 20 మంది ఇలాగే తప్పుడు పత్రాలతో రుణాన్ని పొందినట్లు బ్యాంక్ గుర్తించింది.అయితే నేరం బయటపడటంతో కిరణ్ కౌర్ 4000 సింగపూర్ డాలర్లను తిరిగి చెల్లించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube