ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ట్విన్ టవర్స్ నేలమట్టం అయ్యాయి.నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ టవర్స్ ను.ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులు కూల్చివేశారు.అందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు.కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే ఈ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి.
2009లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్ ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది.రూ.70 కోట్ల వ్యయంతో మూడేళ్లలో ఈ టవర్స్ నిర్మించారు.ఈ జంట టవర్స్ లోని అపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు కాగా, ఇందులో 32 అంతస్తులు ఉన్నాయి.
సియాన్ టవర్స్ ఎత్తు 95 మీటర్లు.అయితే నిబంధనలను ఉల్లంఘించి దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, టవర్స్ ను కూల్చేయాలంటూ గతేడాది తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలోనే నేడు నోయిడా ట్విన్ టవర్స్ ను అధికారులు కూల్చివేశారు.