ఫ్లాప్ ఎఫర్ట్‌.. రవితేజ సినిమాల ఆర్డర్ లో మార్పు వచ్చేనా!

మాస్ మహా రాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఖిలాడి మరియు రామారావు అండ్ డ్యూటీ సినిమా లతో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు.ఆ రెండు సినిమా లు భారీ విజయాలను సొంతం చేసుకుంటారని ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

 Raviteja New Films Release Dates Not Yet Conformed , Dhamaka, Flim News, Khiladi-TeluguStop.com

కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ టాక్ ని దక్కించుకొని నిర్మాతలకు రక్త కన్నీరుని మిగిల్చాయి.ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇప్పుడు రవితేజ తదుపరి సినిమాలకు సంబంధించి ఆర్డర్ తారు మారు అవుతుందని తెలుస్తోంది.

మొదటగా ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు మరియు రాక్షసుడు సినిమాలు విడుదల అవ్వాల్సి ఉన్నాయి.

కానీ మూడు సినిమాల యొక్క ఆర్డర్‌ అటు ఇటు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.సినిమాలకు సంబంధించిన విడుదల తేదీల విషయం లో ప్రస్తుతం రవితేజ దర్శకులతో మరియు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

రవితేజ మరియు దర్శకులు సినిమాలతో సక్సెస్ లను దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా క్ల్యాష్‌ కాకుండా సినిమాల విడుదల తేదీలను నిర్ణయించాలని దర్శకుడు మరియు హీరో చర్చలు జరుపుతున్నారు.

వారి మధ్య సరియైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సినిమాల విడుదల తేదీల్లో కరెక్టు నిర్ణయం తీసుకుంటారని రవితేజ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే రవితేజ మరియు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల దర్శకులతో చర్చలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ మూడు సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఈ ఏడాదిలో మరో రవితేజ సినిమా వస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

అతి త్వరలోనే రవితేజ నటించిన కొత్త సినిమాకు సంబంధించిన విడుదల తేదీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.రవితేజ ఈసారి సక్సెస్ కొట్టాల్సిందే అంటూ అభిమానులు చాలా పట్టుదలతో కోరుకుంటున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube