హిందీలో డబ్ అయిన సౌత్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్.. లైగర్ కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే?

చాలావరకు సినీ దర్శకులు సినిమాలను కేవలం ఒక భాష లోనే కాకుండా పలు భాషల్లో కూడా విడుదల చేయాలని అనుకుంటారు.అలా ఇప్పటికి ఎన్నో డబ్బింగ్ సినిమాలు వచ్చాయి.

 The First Day Collections Of South Movies Dubbed In Hindi Should You Be Shocked-TeluguStop.com

ఇక ఇతర భాషల్లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలను డబ్బింగ్ చేయడం కంటే రీమేక్ చేయటంతో ఎక్కువ సక్సెస్ ఉంటుందని రీమేక్ చేస్తుంటారు.ప్రస్తుతం చాలా రీమేక్ సినిమాలు ఉండగా ఒకప్పటి నుంచే తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు పరిచయమయ్యాయి.

ఇప్పటికే ఎన్నో రీమేక్ సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ లు అందుకున్నాయి.ఇదిలా ఉంటే టాలీవుడ్ సినిమాలు హిందీలో కూడా డబ్బింగ్ కాగా తెలుగులో కంటే ఎక్కువగా హిందీలో ఫస్ట్ డే నే కలెక్షన్ పరంగా మంచి వసూలు సొంతం చేసుకున్నాయి.

అలా ఫస్ట్ డే విడుదలైన సినిమాలకు వచ్చిన కలెక్షన్ లు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

కే జి ఎఫ్ 2: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా కేజీఎఫ్ 2.ఇక ఈ సినిమాలో యష్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా హిందీలో డబ్బింగ్ కాగా మొదటి రోజు రూ.53.95 కోట్లు వసూలు అయ్యాయి.

బాహుబలి 2: డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా బాహుబలి 2.పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా హిందీలో కూడా డబ్బింగ్ గా విడుదలైంది.ఇక ఈ సినిమాకు రూ.41 కోట్లు వసూలు అయ్యాయి.ఇక బాహుబలి 1 కూడా రూ 5.15కోట్లు వసూలు చేసుకుంది.

సాహో: ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ సాహో.ఇక ఈ సినిమా టాలీవుడ్ లో అంత సక్సెస్ కాలేకపోయినా హిందీలో మాత్రం మంచి సక్సెస్ అందుకుంది.అయితే ఇక్కడ తొలి రోజు రూ.24.4 కోట్ల వసూల్ అయ్యాయి.

Telugu Bhahubali, Bollywood, Kgf, Liger, Radhe Sysam, Robo, Sahoo-Movie

ఆర్ఆర్ఆర్: రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా హిందీలో డబ్బింగ్ కాగా రూ.20.07 కోట్ల వసూలు సొంతం చేసుకుంది.

2.0: క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా హిందీలో డబ్బింగ్ కాగా రూ.29.74 కోట్లు వసూలు చేసుకుంది.

Telugu Bhahubali, Bollywood, Kgf, Liger, Radhe Sysam, Robo, Sahoo-Movie

రాధేశ్యామ్: ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగులో అంత సక్సెస్ కాలేకపోయింది.ఇక హిందీలో కూడా ఈ సినిమా విడుదల కాగా రూ.4.50 కోట్లు సొంతం చేసుకుంది.

ఇక ఇవే కాకుండా జంజీర్ రూ.3.58కోట్లు, కబాలి రూ.3.50 కోట్లు, పుష్ప రూ.3.31కోట్లు, సైరా రూ.2.6 కోట్లు వసూలు సొంతం చేసుకోగా.ఇటీవలే విడుదలైన లైగర్ రూ.5.75 కోట్లు వసూలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube