ఆ ఇద్ద‌రితో అమిత్ షా భేటీ అందుకేనా..?

బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా సినీ రంగం, మీడియాలో ప్ర‌ముఖులైన ఇద్ద‌రితో భేటీ కావ‌డం ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం రేగుతోంది.మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దుసుకెళ్తున్న బీజేపీ ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తోంది.

 Is That Why Amit Shah Met Those Two Amith Shah, Junior Ntr, Ramojirao, Bjp, Tdp-TeluguStop.com

అందులో భాగంగానే తాజాగా మునుగోడులో.మునుగోడు సమరభేరి పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరైన విష‌యం తెలిసిందే.

అయితే ఈ స‌భ అనంతరం అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావటం.అంతకుముందు మీడియా మొఘల్ రామోజీతో భేటీ కావడం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచల‌నం రేపుతోంది.

అయితే ఈ రెండు భేటీల‌ వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.అయితే వ్యూహాత్మకంగానే రెండు భేటీలు జరిగినట్లుగా బీజేపీ ముఖ్యులు చెబుతున్నారు.

అదేంటంటే.తెలంగాణలోని సెటిలర్లను ఆకర్షించటంలో భాగంగానే ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ సాగినట్లుగా చెబుతున్నారు.

సెటిల‌ర్లపై ఫోకస్.!

అయితే ఎన్టీఆర్ తో భేటికి ఆర్ఆర్ఆర్ మూవీలో అత‌ని న‌ట‌న‌కు అభినందించ‌డానికి మాత్ర‌మే క‌లిసి న‌ట్లు చెప్తున్నా దీని వెనుక వ్యూహాత్మ‌క ప్లాన్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.అదేంటంటే.జీహెచ్ఎంసీలో సెటిలర్లు ఎక్కువగా ఉండటం.గ‌తంలో జ‌రిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవటం.అవన్నీ కూడా సెటిలర్లు ఓట్లు వేసినకారణంగానే కావటం తెలిసిందే.

అయితే ఏపీకి చెందిన వారు హైదరాబాద్ లో సెటిల్ అయిన వారంతా బీజేపీపై ఆగ్రహంగా ఉన్నట్లుగా ప్రచారం సాగింది.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంతో వారంతా బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్న వాద‌న ఉంది.

ఈ నేప‌థ్యంలోనే రాబోయే ఎన్నికల్లో ఏపీ సెటిలర్లను ఆకర్షించేందుకు తాజా భేటీ జరిగినట్లుగా చెబుతున్నారు.అమిత్ షా ప్రత్యేకంగా తారక్ తో భేటీ కావటం ద్వారా.

బీజేపీ సానుకూలంగా ఉందన్న సంకేతాల్ని ఇవ్వటంతో పాటు సెటిలర్లను ఆకర్షించేందుకు స్కెచ్ వేసినట్లుగా చెబుతున్నారు.టీడీపీ.

సెటిలర్ల విషయంలో తాము పాజిటివ్ గా ఉన్నట్లుగా సంకేతాలు ఇవ్వటం కోసమే తాజా భేటీ సాగినట్లుగా చెబుతున్నారు.

Telugu Amith Shah, Hyderabad, Ntr, Ramojirao-Political

పార్టీలోకి వ‌చ్చే చాన్స్ లేదు..!

అయితే అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ సందర్భంగా ఆయన్ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతుందన్న చర్చ జ‌రిగింది.అయితే అందులో నిజం లేద‌ని అంటున్నారు.అసలు అలాంటి అవకాశమే లేదంటున్నారు.ఇక టీడీపీ తరఫున గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేయ‌డం తెలిసిందే.అలాగే ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం.

తన ప్రాణం ఉండేవరకు టీడీపీలోనే ఉంటానని చెప్పిన నేపథ్యంలో ఎన్టీఆర్ బీజేపీలో చేరే చాన్స్ లేదంటున్నారు.అయితే కేవ‌లం హైద‌రాబాద్ లో ఉన్న సెటిల‌ర్ల‌ను కూల్ చేయ‌డానికే అనే వాద‌న వినిపిస్తోందిత‌.

మ‌రి మున్ముందు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube