' ముందస్తు ' పై బాబు తొందర ? అభ్యర్థుల ఖరారు 

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతున్న వారిలో టిడిపి అధినేత చంద్రబాబు ఒకరు.జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు,  మారుతున్న రాజకీయ పరిణామాలు వంటి వాటిని విశ్లేషించుకుంటూ చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.

 Babu's Rush On 'prediction' Finalization Of Candidates Tdp, Ysrcp, Ap, Ap Gover-TeluguStop.com

అందుకు ముందుగానే బాబు తమ పార్టీని సిద్ధం చేస్తున్నారు.ప్రజాబలం పెంచుకోవడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై పోరాటాల్లో పాలుపంచుకోవాలని పదే పదే పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.

అంతేకాదు నియోజకవర్గాల వారిగా ఇన్చార్జిల నియామకం చేపట్టడమే కాకుండా, కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.అభ్యర్థి పేరు బహిరంగంగా ప్రకటించడం ఇబ్బంది అనుకున్నచోట నియోజకవర్గ ఇన్చార్జిలను తన వద్దకు పిలిపించుకుని టికెట్ మీకే ఇస్తామని,  నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజాబలం పెంచుకోవాలని సూచిస్తూ అభ్యర్థిని ఖరారు చేస్తున్నారు.

    ఎన్నికలకు ముందు అధికారికంగా ప్రకటన చేస్తామని టిక్కెట్ ఇచ్చే విషయంలో భరోసా తనదే అంటూ చంద్రబాబు హామీ ఇస్తూ ఉండడంతో, చాలా నియోజకవర్గ ఇన్చార్జిలు ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 130 నియోజకవర్గాల వరకు చంద్రబాబు ఒక అంచనాకు వచ్చారట.

అక్కడ అభ్యర్థులను అప్పుడే డిసైడ్ చేసేసారట.మిగిలిన చోట్ల పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టే విధంగా చేయాలని పార్టీ శ్రేణులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా ఈ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నాయని , గ్రూపు రాజకీయాలు ఎక్కువ కావడం వల్ల పార్టీ వెనకబడి పోతుందని బాబు గ్రహించారు.     

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Tdp Candis, Tdpconstency, Tdp Mlas, Ysrcp-Politic

అందుకే బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించుకున్నారట.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో జనాల్లోకి వెళుతున్న తీరు,  జగన్ నియోజకవర్గాల వారిగా చేస్తున్న సర్వేలు ఇవన్నీ ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే అనే అనుమానంతో ఉన్న బాబు ఈ విధంగా ముందస్తుగా అభ్యర్థులను ఖరారు చేసే పనులు పడ్డారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube