టాలీవుడ్ లో కొత్త స్టైల్ తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండే హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.ఈయన ప్రేక్షకుల చేత స్టైలిష్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.
ఇక ఇప్పుడు ఈ స్టైలిష్ స్టార్ భార్య కూడా ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాషన్ ఫాలో అవుతుంది.ఇది వరకుతో పోల్చితే ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు కాస్త లైమ్ లైట్ లోకి రావడానికి ఇష్టపడుతున్నారు.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వారు ప్రతి నిత్యం ఫాలోవర్స్ కు చేరువలో ఉంటున్నారు.అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.
ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా ఎక్కువుగానే ఉంటారు.తమ లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ ను స్నేహ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్లతో పంచుకుంటుంది.
ఇక తాజాగా స్నేహ తన కొత్త లుక్ లో దర్శనం ఇచ్చింది.ట్రెండీ శారీ లుక్ తో టాప్ టు బాటమ్ డిజైనర్ లుక్ తో మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఈమెను చూసిన వారంతా సూపర్ మోడల్ లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఎంతైనా మన స్టైలిష్ స్టార్ భార్య అంటే ఆ మాత్రం ఉండాలిగా.
ఇక ఇది పక్కన పెడితే అల్లు అర్జున్ ప్రెసెంట్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తుంటే.
రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.ఇక ఈ సినిమా పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ అయినా విషయం విదితమే.
అందుకే అందరు పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు.