అగ్ర రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాదాల నేత డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరుగుతూ ఉండే ట్రంప్ గడిచిన కొంత కాలంగా మీడియాకు టార్గెట్ అయ్యారు.
ఎన్నికల్లో ఓడింది మొదలు ఆయన చుట్టూ సమస్యలు తిరుగుతూనే ఉన్నాయి.క్యాపిటల్ హిల్ దాడి ఘటన ట్రంప్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో…ట్రంప్ పరువును రోడ్డు కీడ్చే పనిలో వ్యతిరేకులు ఉన్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి…ఈ క్రమంలోనే ట్రంప్ టార్గెట్ గా ఏదో ఒక అంశం అమెరికా మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉందని, భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని 2024 ఎన్నికలలోగా ట్రంప్ బలపడకుండా ఉండేందుకు ట్రంప్ ను ఏదో ఒక వివాదాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని ట్రంప్ వర్గం బలంగా వాదిస్తోంది.
ట్రంప్ అధికారంలో రాక ముందు తన ఆస్తుల కు సంభందించిన వివరాలను గోప్యంగా ఉంచి పన్ను ఎగవేసారని, అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పులను కప్పి పుచ్చుకున్నారని వచ్చిన విమర్శల పై ప్రస్తుత అధ్యక్షుడు బైడన్ విచారణ కమిటీ ని నియమించగ ట్రంప్ కమిటీ ముందు తాజాగా హాజరయ్యారు.అయితే ఈ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని అలాగే ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కొన్ని కీలక పత్రాలను చించేసి వాటిని బాత్ రూమ్ లోని షింక్ లో పడేసి మాయం చేసేవారని తాజాగా ఓ మీడియా ప్రచురించిందని ఇవన్నీ భవిష్యత్తు లో ట్రంప్ ను ఎన్నికల్లో ఎదుర్కునే ధైర్యం లేక డెమోక్రటిక్ పార్టీ, కొందరు వ్యతిరేకులు, ట్రంప్ ను వ్యతిరేకించే మీడియా కావాలని చేస్తున్న కుట్రలు గా ట్రంప్ మద్దతుదారులు అభివర్ణించారు.