1.కిక్ ఆఫ్ గేట్ టూ గెదర్ వేడుకలు విజయవంతం
బే ఏరియా తెలుగు సంఘం స్వర్ణోత్సవ వేడుకలు అక్టోబర్ 22 న జరగనున్న నేపథ్యంలో ‘కిక్ ఆఫ్ గెట్ టూ గెదర్ ‘ వేడుకలు తెలుగు వారు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
2. డాలాస్ లో విజయవంతమైన ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి ‘
డాలాస్ లో ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి ‘ శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.తానా డాలాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
3.కువైట్ లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత
కువైట్ లో ఆదివారం 53 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.గతంతో పోలిస్తే ఇది బాగా ఎక్కువని అక్కడి అధికారులు వెల్లడించారు.
4.ట్విట్టర్ పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
టెస్లా కార్ల అధినేత బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై ఆరోపణలు చేశారు.
ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ను సవాల్ చేస్తూ .మీ సంస్థ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తుందని, స్పాం బోట్స్ ఎస్టిమేషన్ లోపభూయిస్టంగా ఉందని ఆరోపించారు.
5.మిస్ ఇండియా యూఎస్ఏ గా ఆర్య వల్వేకర్
భారతీయ అమెరికన్ యువతి ఆర్య వల్వేకర్ మిస్ ఇండియా యూఎస్ఏ 2022 గెలుచుకున్నారు.
6.కామన్ వెల్త్ గేమ్స్ లో 10 మంది శ్రీలంక కళాకారులు మిస్సింగ్
కామన్ వెల్త్ గేమ్స్ నుంచి పదిమంది శ్రీలంక క్రీడాకారులు అదృశ్యం అయ్యారని అధికారులు ప్రకటించారు.
7.కెనడాలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు
కెనడాలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఆ దేశ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది.
8.భారత్ కు మరో స్వర్ణం
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది.
మెన్స్ డబుల్స్ లో రాంకీ రెడ్డి , చిరాగ్ శెట్టి స్వర్ణం సాధించారు.