బిగ్ బాస్ 6 ప్రోమోని డైరెక్ట్ చేసింది ఎవరంటే..!

ఐదు సక్సెస్ ఫుల్ సీజన్ లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు ఆరో సీజన్ కి రెడీ అవుతుంది.బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ బిగ్ బాస్ ఒకటి నిర్వహించారు.

 Biggboss Season 6 Promo Directed By Prashanth Varma Details, Bigg Boss, Bigg Bos-TeluguStop.com

అయితే అది ఓటీటీ ఆడియెన్స్ మాత్రమే చూసే అవకాశం ఉండటంతో అది పెద్దగా క్లిక్ అవలేదు.ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 పై మరింత క్రేజ్ ఏర్పడింది.

సీజన్ 6 ని కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారని తెలుస్తుంది.సీజన్ 6 కోసం స్టార్ సెలబ్రిటీస్ ని కంటెస్టంట్స్ గా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది.

త్వరలో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమోలు రెడీ చేస్తున్నారు.ఈ ప్రోమోలని ప్రముఖ డైరక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నట్టు సమాచారం.అ!, కల్కి సినిమాలతో తన టాలెంట్ చూపించిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డితో కూడా హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం అతను హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు.

ఫస్ట్ ఇండియన్ తెలుగు సూపర్ హీరోఫ్ మూవీగా హనుమాన్ వస్తుంది.వీటితో పాటుగా రియాలిటీ షోస్ ప్రోమోలని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

Telugu Bigg Boss, Biggboss, Biggboss Promo, Biggboss Season, Biggboss Ups, Prasa

ఆమధ్య ఆహా అన్ స్టాపబుల్ షో కోసం ప్రోమోని చేశాడు ప్రశాంత్ వర్మ.బాలయ్య హోస్ట్ గా చేసిన ఆ షో టీజర్ లు అన్నీ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసినవే.ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కోసం కూడా ప్రోమోని సిద్ధం చేస్తున్నారట.ఈ ప్రోమో షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుందని తెలుస్తుంది.సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.ఈసారి సీజన్ మరింత గ్రాండ్ గా ఉండబోతుందని అంటున్నారు.

సీజన్ 6 కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube