మాస్ మహారాజా రవితేజ హీరో గా శరత్ మండవ దర్శకత్వం లో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా దర్శకుడు గతం లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణం గా అనుకున్నట్లుగానే సినిమా పై ప్రభావం చూపించాయి.
పైగా రవితేజ గత చిత్రం కిలాడీ ఫలితం కూడా ఈ సినిమా విషయం లో తీవ్రం గా ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రామారావు ఆన్ డ్యూటీ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ సమయం లోనే బయ్యర్లు సినిమా ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించ లేదని వార్తలు వచ్చాయి.
సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఎక్కువ బిజినెస్ జరగని కారణంగా విడుదల వాయిదా వేశారు.
రెండవ సారి బిజినెస్ అలాగే ఉండడం తో తప్పని పరిస్థితుల్లో తక్కువ మొత్తానికి ఈ సినిమా ని అమ్మేసి విడుదలకు సిద్ధం అయ్యారు.
సినిమా విడుదల తర్వాత కచ్చితం గా భారీగా వసూళ్లు నమోదు అవుతాయి అని యూనిట్ సభ్యులు.ముఖ్యంగా రవితేజ భావించాడు.
ఈ సినిమాను తాను స్వయంగా నిర్మించాడు.భారీ మొత్తం లో పెట్టుబడి పెట్టడంతో రవితేజ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.
కానీ ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి.తాజాగా ఆయన ఈ సినిమాతో భారీ కమర్షియల్ ప్లాప్ ను చవిచూశాడు.
గత చిత్రం కిలాడీ ఫ్లాప్ నేపథ్యంలో రవితేజ కి పెద్దగా నష్టమేమీ లేదు.కానీ ఈ సినిమా వల్ల ఆయనకు భారీగా నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని బయ్యర్లు ముందుగానే ఊహించారు అంటూ మీడియా సర్కిల్స్ వారు మరియు సినీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.రవితేజ తదుపరి సినిమాలు అయినా బాగుంటాయేమో చూడాలి.