అల్లు అరవింద్ చేతిలో ఉదయ్ కిరణ్ డైరీ.. ఏమీ చేయలేక పోయిన మురళీ మోహన్ ... సంచలన నిజాలు

ఉదయ్ కిరణ్. యువతకు ఇతడు ఒక లవర్ బాయ్ అలాగే చాక్లెట్ బాయ్.

 Uday Kiran Dates Dairy With Allu Aravind Details, Hero Uday Kiran , Uday Kiran D-TeluguStop.com

కెరియర్ లో ఒడిదుడుకులను భరించలేని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని కన్ను మూశాడు.ఆయన ఆత్మకు ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు.

ఎవరెన్ని కారణాలు చెప్పిన వాస్తవం ఏమిటి అనేది ఉదయ్ కిరణ్ కి మాత్రమే తెలుసు.ప్రస్తుతం ఆయన లేడు అన్నది మాత్రమే.

ఉదయ్ చనిపోయింది మొదలు నేటి వరకు తనపైన వందల కొలది ఆర్టికల్స్ పుట్టుకొచ్చాయి.సోషల్ మీడియాలో సైతం ఎవరికి నచ్చినట్టు వారు రాసుకున్నారు.

తనతో పని చేసిన తోటి నటీనటులు, దర్శకులు కూడా తమకు తోచిన విషయాలను, తమకు తెలిసిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

ప్రస్తుతం మురళీమోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

మహేష్ బాబు నటించిన సంచలన విజయం సాధించిన అతడు సినిమా మురళీమోహన్ సంస్థలైన జయభేరి ఆర్ట్స్ నిర్మించింది అనే విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో యువతకు ఎంతగానో నచ్చింది అంతేకాదు రికార్డులను సైతం కొల్లగొట్టింది.

అయితే మురళీమోహన్ చెప్పిన విషయం ప్రకారం ఈ సినిమా కోసం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ ని తొలుత హీరోగా చేయాలని మురళీమోహన్ భావించాడట.

ఆ విషయం ఉదయ్ కిరణ్ తో ప్రస్తావిస్తే అతడు మూవీ చేయడానికి తన సిద్ధమంటూ కూడా మాట ఇచ్చాడట ఉదయ్.

Telugu Allu Aravind, Athadu, Chiranjeevi, Uday Kiran, Mahesh Babu, Murali Mohan,

అయితే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పట్టింది.ఈ లోగా ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కుమార్తె సుష్మితతో వివాహం నిశ్చయమైంది.వివాహం కుదిరింది మొదలు ఉదయ్ కిరణ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలు అరవింద్ దగ్గరుండి చూసుకున్నాడని చివరికి అతడు డేట్ కి సంబంధించిన డైరీ ని కూడా అరవింద్ దగ్గరే పెట్టుకున్నాడని ఎవరికి ఏ సినిమా ఒప్పుకోవాలి, ఎవరితో సినిమా చేయాలి ఎన్ని డేట్స్ ఇవ్వాలి అన్నీ కూడా అరవింద్ పర్యవేక్షణలోనే జరిగేవని మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

Telugu Allu Aravind, Athadu, Chiranjeevi, Uday Kiran, Mahesh Babu, Murali Mohan,

అంతకు ముందుగా అతడు సినిమాకి ఒప్పుకున్నాడు కాబట్టి మురళీమోహన్ వెళ్లి ఉదయ్ కిరణ్ డేట్స్ అడగగా అరవింద్ డేట్స్ కాళీ లేవని చెప్పడంతో ఉదయ్ కిరణ్ కూడా ఏమీ చేయలేకపోయాడని అలా అతడు సినిమా ఉదయ్ నుంచి మహేష్ బాబుకు వెళ్లిందంటూ సంచలన నిజాలు బయట పెట్టాడు మురళీమోహన్.ఆ తర్వాత సుష్మిత పెళ్లి క్యాన్సిల్ అవ్వడం జరగడంతో, అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా ఏ కారణాల చేతనో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ నుంచి వెళ్లిపోవడం ఆ తరువాత ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడము ఆ తర్వాత ఆయన చనిపోవడం ఇవన్నీ కూడా మనం చూసాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube