బుల్లితెర పై ప్రసారమవుతున్న ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నాయి.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం కావడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది సెలెబ్రెటీలు వరుస అవకాశాలను అందుకుని బిజీగా గడుపుతున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కార్యక్రమంలో వరుసగా కంటెస్టెంట్ లు ఈకార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు.
ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర టీం ద్వారా జబర్దస్త్ కు పరిచయమైన లేడీ కమెడియన్ సత్యశ్రీ గురించి అందరికీ తెలిసిందే.
ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.అప్పటివరకు ఎన్నో బుల్లితెర సీరియల్స్ అలాగే వెండితెర సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఈ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి.
చమ్మక్ చంద్ర సత్య శ్రీ కి జబర్దస్త్ అవకాశం కల్పించడంతో ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు.అయితే చమ్మక్ చంద్ర జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవడంతో సత్య శ్రీ కూడా బయటకు వెళ్లిపోయారు.
ఈ విధంగా సత్య శ్రీ జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి అనేది ఇంతవరకు తెలియలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాలు ఏంటో తెలిపారు.తనకు జబర్దస్త్ కార్యక్రమం లో అవకాశం కల్పించింది చమ్మక్ చంద్ర కనుక తనని ఒక గురువుగా భావించారని అయితే తమ గురువు ఆ కార్యక్రమాన్ని వదిలి వెళ్లడంతో అతను ఉన్నచోటే మేము కూడా ఉండాలన్న ఉద్దేశంతో మా టీమ్ మొత్తం జబర్దస్త్ కార్యక్రమాన్ని మానేసిందని సత్య శ్రీ వెల్లడించారు.