ఎనిమిది ఏళ్లుగా బుల్లితెర మీద నవ్వులను పూయిస్తూ స్టార్ షోగా ఏర్పడ్డ జబర్దస్త్ ఇప్పుడు అందరికి చేదయిపోయింది.ఒకప్పుడు వారికి అదే అవకాశాల నిధిగా అనిపించగా ఇప్పుడు బయట దానికన్నా మంచి ఆఫర్ రాగానే జబర్దస్త్ ని వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు.
ముందు జడ్జ్ లు ఆ తర్వాత కమెడియన్స్ అందరు ఇలా జబర్దస్త్ ను వీడి బయటకు రాగా లేటెస్ట్ గా జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా షో నుంచి ఎగ్జిట్ అయినట్టు వెల్లడించింది.
ఇదిలాఉంటే జబర్దస్త్ లో ఇప్పుడు కొనసాగుతున్న వారితోనే షోని నడిపించాలి.
అయితే జబర్దస్త్ లో హైపర్ ఆదికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.అతను వచ్చాక షోకి మరింత క్రేజ్ పెరిగింది.
ప్రతి వారం హైపర్ ఆది స్కిట్ సూపర్ సక్సెస్ అయ్యేది.హైపర్ ఆది వరుస పంచులకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
అయితే జబర్దస్త్ లో ప్రస్తుతం హైపర్ ఆది కూడా చేయట్లేదు.జబర్దస్త్ బదులుగా ఈమధ్యనే మొదలు పెట్టిన శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాడు హైపర్ ఆది.
దానితో పాటుగా ఢీ డ్యాన్స్ షోలో మెంటర్ గా చేస్తున్నాడు.అయితే ఇప్పుడు హైపర్ ఆదిని కూడా అక్కడ నుంచి లాక్కోవాలని చూస్తుంది స్టార్ మా.అతను ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి డబుల్ ఇచ్చి అయినా అతన్ని అక్కడ నుంచి బయటకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.జబర్దస్త్ చేయకపోయినా సరే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలో హైపర్ ఆది పంచులు కొంత మైలేజ్ ఇస్తున్నాయి.
ఇప్పుడు అతను కూడా ఖాళీ అయితే మాత్రం జబర్దర్స్త్, ఢీ షోల మీద కూడా ఎఫెక్ట్ పడేలా ఉంది.బుల్లితెర మీద సందడి చేస్తూనే అడపాదడపా సినిమాల్లో కూడా చేస్తున్నాడు హైపర్ ఆది.స్మాల్ స్క్రీన్ మీద తనకున్న క్రేజ్ తో మంచి మంచి ఛాన్సులు అందుకుంటున్నాడు ఈ స్టార్ కమెడియన్.