మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు

దేశంలో మద్యం సేవించేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.ప్రభుత్వాలే నేరుగా మద్యం విక్రయాలు చేస్తూ రాష్ట్ర ఖజానాకు ఆదాయంను పెంచుకుంటోంది.

 News That Kicks Off Drugs Liquor Prices Will Fall Drastically, Liquor Lovers, Go-TeluguStop.com

మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వాల ఖజానాలకు భారీగా ఆదాయం వస్తోంది.దీంతో మరింత ఆదాయం కోసం ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

మద్యం ధరలను తగ్గిస్తూ మందుబాబులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.అసలే సమ్మర్ కావడంతో మద్యం అమ్మకాలు మరింతగా పెరిగిపోయాయి.

వేసవి కాలం దృష్ట్యా ఎండ వేడిని తట్టుకునేందుకు చల్లని బీర్లు, మందు తాగుతూ మందుబాబులు చిల్ అవుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది.2022-23 సంవత్సరానికి సంబంధించి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మద్యం పాలసీని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది.ఈ పాలసీ ద్వారా అపరిమిత కోటా బీర్, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అమ్మకాలను పంజాబ్ ప్రభుత్వం అనుమతించనుంది.

ఈ నిర్ణయం వల్ల పంజాబ్ లో మద్యం ధరలు 35 నుంచి 60 శాతం వరకు భారీగా తగ్గనున్నాయి.

Telugu Liquor Lovers, Liquor, Liquor Drop, Rates-Latest News - Telugu

ప్రస్తుతం పంజాబ్ లో ఒక్కో బీర్ ధర రూ.180 నుంచి రూ.200 వరకు ఉంది.ఈ కొత్త మద్యం పాలసీ వల్ల రూ.120 నుంచి రూ.130 ల్లోపు బీర్ లభించనుంది.ఇక పంజాబ్ లో ప్రస్తుతం ఐఎంఎఫ్‌ఎల్ లిక్కర్ ధర రూ.700గా ఉంది.నూతన పాలసీ వల్ల రూ.400కు తగ్గనుంది.ప్రస్తుతం పంజాబ్ లో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం వల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరుగుతోంది.

దీని వల్ల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.దీంతో మద్యం ధరలను తగ్గిస్తూ కొత్తగా ఏర్పాటైన ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త పాలసీ వల్ల అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ఆదాయం రెట్టిపవుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube