డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా విక్రమ్. ఇందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకు కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ:
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ అరుణ్ కుమార్ అనే పాత్రలో నటించాడు.ఈయన రిటైర్డ్ RAW ఏజెంట్.ఇక ఈయన మాస్క్ మాన్ పేరుతో నగరంలో జరుగుతున్న కిడ్నాపలు అదే సమయంలో పోలీస్ అధికారిగా ఉన్న ఫహద్ ఫాసిల్, అతను ముసుగు మనుషులను పట్టుకోడానికి దర్యాప్తు ప్రారంభిస్తాడు.
ఆ సమయంలోనే సంతానం (విజయ్ సేతుపతి) అనే గ్యాంగ్ స్టర్ గురించి తెలుసుకుంటాడు.ఆ తర్వాత కిడ్నాపర్ల తో సంతానం సంబంధం ఉందని విక్రమ్ తెలుసుకుంటాడు.విక్రమ్ కూడా రహస్య మిషన్ ఉంటుంది.మరి ఆ రహస్యం మిషన్ ఏంటి.ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు అనేది మిగిలిన కథ లో చూడవచ్చు.
నటినటుల నటన:
ఈ వయసులో కూడా కమల్ హాసన్ తన పాత్రతో అద్భుతంగా మెప్పించాడు.నిజానికి ఇంత వయసులో కూడా ఇలాంటి పాత్రలు చేయడం అంత సులువు కాదు అని చేసి మరి చూపించాడు.విజయ్ సేతుపతి కూడా తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు.
ఫహద్ తన భావోద్వేగాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ లోకేష్ కనకరాజు భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కథకు తగ్గట్టు నటీనటులను ఎంచుకున్నాడు.పైగా సన్నివేశాల ఎలివేట్ లు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.గిరీష్ గంగాధరన్ అందించిన సినిమాటోగ్రఫీఅద్భుతంగా ఉంది.అనిరుద్ రవిచంద్రన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హైలెట్ గా నిలిచాయి.ఇక మిగతా టెక్నికల్ టీమ్స్ బాగానే పనిచేశాయి.
విశ్లేషణ:
మంచి సన్నివేశంతో కమల్ హాసన్ ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది.ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా అక్కడక్కడ బాగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది.
విజయ్ సేతుపతి ఎంట్రీ కూడా అద్భుతంగా కనిపిస్తుంది.ఫ్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే పూనకాలే అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీలు, నటీనటుల నటన బాగా ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.ఫ్యామిలీ ఆడియన్స్ కు అంతగా ఆకట్టుకోదు అని చెప్పవచ్చు.
బాటమ్ లైన్:
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ముఖ్యంగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ల అభిమానులకు ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది.కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అంతగా నచ్చకపోవచ్చు.