టీమిండియాలోకి దినేష్ కార్తీక్ రీ ఎంట్రీ... ఇదే నిజమైతే అభిమానులకు పండగే!

దినేష్ కార్తీక్ అంటే ఎవరో తెలియని క్రికెట్ ప్రేమికులు వుండరు.సరిగ్గా మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం త‌ర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా దినేశ్‌ కార్తీక్‌, తన పునరాగమనంపై ఆసక్తికర ట్వీట్‌ చేసి అభిమానులకు తీపికబురు అందించాడు.దాంతో లక్షలమంది అభిమానులు ఆయనకు వెల్కమ్ చెబుతున్నారు.“మనపై మనకు నమ్మకం ఉంటే ప్రతిదీ మనమనుకున్నట్లుగా జరుగుతుంది.కష్టకాలంలో మద్ధతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు.నాపై నమ్మకముంచి మరో అవకాశం ఇచ్చిన సెలెక్టర్లకు కృతజ్ఞతలు.హార్డ్‌ వర్క్‌ కంటిన్యూ చేస్తాను.” అంటూ DK తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

 Dinesh Karthik Re-enters Team India Team India, Dinesh Karthik, Entry, Sports T-TeluguStop.com

కాగా ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.ప్రస్తుత IPLలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్న కార్తీక్‌, త్వ‌ర‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జ‌రుగ‌నున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కావడం విశేషం.

సీజ‌న్‌లో RCBకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న DK బెస్ట్ ఫినిష‌ర్ రోల్ పోషిస్తున్నాడు.ఈ సీజ‌న్‌లో 14 మ్యాచ్‌ల్లో 57.40 సగటున 287 ప‌రుగులు చేసిన కార్తీక్‌, పలు మ్యాచ్‌ల‌ను ఒంటిచేత్తో గెలిపించడం ప్రపంచం చూసింది.ఈ ప్రతిభ కనబరిచినందుకుగాను, అతన్ని మరలా ఇండియా క్రికెట్ టీమ్ లోకి తీసుకున్నట్టు భోగట్టా.

Telugu Dinesh Karthik, Teams, India-Latest News - Telugu

DK చివ‌ర‌గా మ్యాచ్ ఏదంటే, 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌.అదే అతని చివరి మ్యాచ్.అయితే ఆ తర్వాత ఫామ్ లేమి కార‌ణంగా అతను జ‌ట్టులో చోటు కోల్పోయాడు.36 ఏళ్ల కార్తీక్‌ లేటు వ‌య‌సులో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్ర‌తిభ‌కు వ‌య‌సుతో సంబంధం లేద‌ని DK మరోసారి నిరూపించాడంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube