'NBK107'.. మరో భామతో బాలయ్య స్టెప్పులు.. ఎవరంటే?

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.

 Hot Beauty To Shake A Leg With Balakrishna-TeluguStop.com

చాలా రోజుల తర్వాత బాలయ్యకు ఇటు బోయపాటి కి మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.

యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సిరిసిల్ల ప్రాంతంలో పూర్తి చేసుకుంది.

తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలో స్టార్ట్ చేసారు.ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గోపీచంద్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను వచ్చే దాసన నాటికీ థియేటర్స్ లోకి తీసుకు రావాలన్న ప్లాన్ తో మేకర్స్ పని చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ఒక న్యూస్ బయటకు వచ్చింది.

Telugu Dimple Hayathi, Hotshake, Nbk-Movie

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం విదితమే.ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరొక హాట్ బ్యూటీ యాడ్ అయినట్టు టాక్.ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటెం నెంబర్ ఉండనుందట.ఈ మాస్ పాటకు స్టెప్పులు వేయడానికి డింపుల్ హయతి ని రంగంలోకి దింపారట.డింపుల్ హయతి తో బాలయ్య మాస్ స్టెప్పులు వేయనున్నాడు.మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.

ఇక కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube